Asaduddin Owaisi : పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Asaduddin Owaisi : పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Asaduddin Owaisi : పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్

Asaduddin Owaisi : ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారత్ కంటే పాకిస్తాన్ 50 ఏళ్లు వెనుకబడ్డదని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత్ నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన ప్రధాన దేశాల్లో ఒకటిగా ఎదగగా, పాకిస్తాన్ మాత్రం పేదరికం, తీవ్ర ఉగ్రవాద సమస్యలతో ఇరుక్కుపోయిందని తెలిపారు. భారత్ బడ్జెట్‌లో సగం కూడా మిలటరీ ఖర్చులకు కేటాయించకపోయినా దేశ అభివృద్ధిలో ముందుండిపోతోందని గుర్తు చేశారు.

Asaduddin Owaisi పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్

Asaduddin Owaisi : పాకిస్తాన్ నేతలను ISIS ఉగ్రవాదులతో పోల్చిన అసదుద్దీన్

Asaduddin Owaisi : భారత్ కంటే 50 ఏళ్లు వెనుకబడిపోయారని పాక్ పై అసదుద్దీన్ విమర్శలు

పాకిస్తాన్ మిలటరీ బడ్జెట్ భారీకాకపోయినా, దేశంలో అభివృద్ధికి దోహదపడడం లేదని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. పాకిస్తాన్ నాయకులను ఆయన ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) ఉగ్రవాదులతో పోల్చుతూ, వారి మాటలు కూడా అంతే ప్రమాదకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదని, శాంతిని కాపాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

దేశంలోకి అక్రమంగా చొరబడే ప్రయత్నం చేస్తే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్ ఇచ్చారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా సిద్ధమై ఉందని తెలిపారు. శాంతిని కోరుకుంటే పాకిస్తాన్ నాయకులు హేతుబద్ధంగా ప్రవర్తించాలి, లేనిచో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కఠినంగా హెచ్చరించారు. అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు అందర్నీ షాక్ కు గురి చేస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది