Barrelakka Shirisha : బర్రెలక్కపై దాడి.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని ఎవరు దాడి చేయించారు? చంపేస్తారేమోనని వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka Shirisha : బర్రెలక్కపై దాడి.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తోందని ఎవరు దాడి చేయించారు? చంపేస్తారేమోనని వెక్కి వెక్కి ఏడ్చిన బర్రెలక్క

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  బర్రెలక్క తమ్ముడిని కొట్టిన రౌడీలు

  •  బర్రెలక్కను భయపెట్టడం కోసమే అతడిపై దాడి చేశారా?

  •  బర్రెలక్క కుటుంబంపై దాడి చేయించింది ఎవరు?

Barrelakka Shirisha : కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కపై తాజాగా దాడి జరిగింది. తనపై, తన తమ్ముడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టు తెలుస్తోంది. దీంతో బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు చిన్న పిల్లాడని.. వాడిపై మూకుమ్మడిగా దాడి చేశారని ఆమె వాపోయింది. రౌడీ రాజ్యం అనే పేరు ఇప్పటి వరకు విన్నానని.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను బెదిరించడం కాదు.. నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించండి. మా తమ్ముడిపై దాడి చేసి మీరు ఏం సాధిస్తారు. నేను నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాను.. వాళ్ల సమస్యలపై పోరాడుతున్నాను. అందుకని మా కుటుంబంపై దాడి చేస్తారా? ఇప్పటి వరకు నాకు చాలామంది ఫోన్లు చేసి బెదిరించారు. ఇప్పుడు ఏకంగా దాడికే దిగారు. నన్ను ఎవరు బెదిరిస్తున్నారో.. మా కుటుంబంపై ఎవరు దాడి చేయించారో కూడా నాకు తెలుసు. అయినా నేను వాళ్ల పేర్లు చెప్పను.. నాకు అవసరం లేదు అంటూ బర్రెలక్క మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు లేదా? మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు. ప్రచారం కూడా చేసుకోవద్దా? మీకు ఏం అధికారం ఉంది. రాజ్యాంగంలో లేదా? నామినేషన్ వేయకూడదని రాజ్యాంగంలో ఉందా? ఇలాంటి దాడులు ఏంటి? ఇది కరెక్టేనా ఇలా దాడులు చేయడం. 18 ఏళ్ల పిల్లగాడు వాడు. ఐదారుగురిని పెట్టి కొట్టించారు. ఇలాంటి బెదిరింపులు కాదు. ఒక్కసారి మీరు చేసిన అభివృద్ధి ఎలా ఉందో చూసుకోండి. మేము మంచి చేయడానికి వచ్చాం. మాకు ఏం తెలియదు. గెలిచి 10 మంది న్యాయం చేద్దామని అనుకున్నా కానీ.. నన్ను ఇలా చేస్తారని అనుకోలేదు. మా తమ్ముడు మాకు అన్నం పెడుతుంటే బయటికి వచ్చి తీసుకొచ్చి కొట్టారు. మా తాత ఎప్పుడు చెబుతూ ఉండే వాడు.. రాజకీయం అంటేనే రౌడీఇజం అన్నాడు. ఇప్పుడు అవన్నీ నేను కళ్లతో చూస్తున్నాను అంటూ బర్రెలక్క మండిపడ్డారు.

Barrelakka Shirisha : నిరుద్యోగుల కోసమే నేను పోరాడుతున్నా

నేను నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడటం కోసం పోటీ చేస్తున్నాను. వాళ్ల సమస్యల కోసం పోటీ చేయకూడదా? నా ప్రచారాన్ని నన్ను చేసుకోనివ్వండి. మాపై దాడులు చేయడం కాదు. మీ ప్రచారం మీరు చేసుకోండి. మిమ్మల్ని అడ్డుకోవడం లేదు కదా? మిమ్మల్ని కించపరిచానా? మీ పార్టీ ఎత్తానా? నా ప్రచారం నేను చేసుకుంటూ ఉంటే నా మీద దాడులు చేయడం ఏంటి. ఇప్పటికైనా మారండి.. ఓట్లు చీలుతాయని దాడులు చేయిస్తున్నారు. రేపు పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకొని ఓట్లు వేయండి.. అని ప్రజలను బర్రెలక్క కోరారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది