Mlc Kavitha : కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన న్యాయమూర్తి.. కస్టడీ పొడిగింపు….!
ప్రధానాంశాలు:
Mlc Kavitha : కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన న్యాయమూర్తి.. కస్టడీ పొడిగింపు....!
Mlc Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా కవితకి 23 వరక జ్యుడిషీయల్ రిమాండ్ విధిస్తూ.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు కవితను మరోసారి తీహార్ జైలుకు తరలించారు. కాగా, మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఇవాళ ఉదయం కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరు పరిచారు. సిబిఐ విచారణలో కవిత తమకు సహకరించ లేదని సిబిఐ న్యాయవాదులు న్యాయమూర్తికి తెలియజేశారు. అయితే కవిత మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించారు.
Mlc Kavitha : పెద్ద షాకే..
ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనతో పాటు జోన్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో ఉంది. కవితకు ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. కవితను తీహార్ జైలుకు పంపారు. వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాదులు.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని తెలిపారు. ఆమె విచారణకు సహకరించలేదని.. కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది.

Mlc Kavitha : కవితకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన న్యాయమూర్తి.. కస్టడీ పొడిగింపు….!
అయితే కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యుడిషీయల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఈడీ కూడా కవితను రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించడం మనం చూశాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తెను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్టు చేసింది, ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమె కూడా ఒకరని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన కేసులో కవిత ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు.