ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలి.. హరితహారం కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
నల్గొండ జిల్లా : గ్రామాలలో పచ్చదనం వెల్లివిరియాలని పారిశుధ్ధ్యం, అభివృద్ది కార్యక్రమాలలో ముందంజలో నిలవాలనే ఉద్ధేశ్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేసిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ Badugula Lingaiah Yadav .. శనివారం కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో నిర్వహించిన నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ Badugula Lingaiah Yadav గారు. భీమారం గ్రామంలో నూతనంగా నిర్మించిన మిషన్ భగీరథ మంచి నీటి ట్యాంకును ప్రారంభోత్సవం చేసి నల్లాల ద్వారా నీటిని విడుదల చేశారు. తదనంతరం గ్రామంలోని గృహిణులకు తడి చెత్త మరియు పొడి చెత్త బుట్టలను,ఆరు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ బడుగుల Badugula Lingaiah Yadav మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెల అభివృద్ధి కోసం పల్లె ప్రగతి మరియు పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అందుకొరకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని అన్నారు.ముఖ్యమంత్రి గారు ఆశించిన మేరకు గ్రామ అభివృద్ధికి పచ్చదనం, పారిశ్యుధ్ధ్యం మెరుగుదలకు అందరు కృషి చేయాలన్నారు.
పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధుల ఆటంకం ఉండొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏటా 369 కోట్ల రూపాయలను కెటాయించారని ఈరోజు హరితహారం కార్యక్రమం లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి నాటడం, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం ద్వారా 23 శాతంగా ఉన్న అడవులను మళ్లీ 33 శాతానికి పెంచుకునే ప్రయత్నం హరితహారం ద్వారా పటిష్టంగా జరుగుతోందని అడవులు తగ్గిపోవడం వల్ల ఆక్సిజన్ కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని…
ఈ స్థితి నుంచి శాశ్వతంగా బయటకు రావాలంటే మొక్కలను నాటడం వాటిని సంరక్షించడమే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బడుగుల శ్రీనివాసులు గారు, డిప్యూటీ సీఈఓ కాంతమ్మ గారు, మండల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు