Bandi Sanjay : ఏపీ నుంచి కేంద్ర మంత్రి అవ్వబోతోన్న బండి సంజయ్ – ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు?
Bandi Sanjay : అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణకు సంబంధించి బీజేపీ పార్టీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల బీజేపీ అధ్యక్షులను మార్చింది హైకమాండ్. అలాగే.. కేబినేట్ లోనూ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చీప్ గా ఉన్న బండి సంజయ్ ని పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయన ఇప్పుడు ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ చీఫ్ గా చేశారు. ఏపీలోనూ బీజేపీ అధ్యక్షుడిని మార్చారు. పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ, ఏపీనే బీజేపీ హైకమాండ్ టార్గెట్ చేసినట్టు ఈ మార్పులతో స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని పటిష్టపరిచేందుకు ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో మంత్రవర్గంలోనూ పలు మార్పులు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు పక్కన పెడితే.. ఇంకో నాలుగైదు నెలల్లో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. అందుకే.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది.ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏతో భాగస్వాములుగా ఉన్న పార్టీలను ఐక్యంగా ఉంచేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంతో జతకట్టిన శివసేన, ఎన్సీపీ వర్గాల్లోని కీలక నేతలకు పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లాంటి వాళ్లకు కేబినేట్ బెర్త్ లో చోటు దక్కే చాన్స్ ఉంది.
Bandi Sanjay : కొత్తగా కేబినేట్ పదవి ఎవరికి దక్కనుంది?
అలాగే.. తెలంగాణలో బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం వేసే వ్యూహాలు ఇవన్నీ. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారును చీల్చి చెండాడే సత్తా ఉన్న నాయకుల్లో బండి సంజయ్ ఒకరు. అందుకే.. ఆయన ద్వారానే బీజేపీ తెలంగాణలో బలోపేతం కావాలని.. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బండి సంజయ్ కి మాత్రమే కేంద్ర మంత్రి పదవి దక్కనుంది.