Barrelakka Sirisha : మా నాన్న పచ్చి తాగుబోతు .. అత‌ని మాట‌లు ఎవ్వ‌రు న‌మ్మొద్దు.. బర్రెలక్క..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Barrelakka Sirisha : మా నాన్న పచ్చి తాగుబోతు .. అత‌ని మాట‌లు ఎవ్వ‌రు న‌మ్మొద్దు.. బర్రెలక్క..!

 Authored By anusha | The Telugu News | Updated on :26 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Barrelakka Sirisha : మా నాన్న పచ్చి తాగుబోతు ..

  •  అత‌ని మాట‌లు ఎవ్వ‌రు న‌మ్మొద్దు.. బర్రెలక్క..!

Barrelakka Sirisha : ప్రస్తుత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బర్రెలక్క పేరు వినిపిస్తుంది. కొల్లాపూర్ నియోజక వర్గంలో సంచలనం సృష్టిస్తున్నారు ఒక చిన్న వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ టాపిక్ గా మారారు. కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి దేశ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం బర్రెలక్కకు దేశవ్యాప్తంగా సపోర్టు లభిస్తుంది. గతంలో ఉద్యోగం లేక బర్రెలు కాసుకుంటున్నట్లు వీడియో చేసి ఫేమస్ అయిన బర్రెలక్క తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యారు.

అయితే ఓ ఇంటర్వ్యూలో బర్రెలక్క తన తండ్రి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాన్న పచ్చి తాగుబోతు అని, వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని మమ్మల్ని వదిలేశాడు అని అన్నారు. మా అమ్మ కష్టపడి చదివించింది. మా నాన్న రోజు తాగి వచ్చి మా అమ్మని బాగా కొట్టేవాడు. మమ్మల్ని కూడా బాగా కొట్టేవాడు. మా అమ్మ లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళమో అని బర్రెలక్క ఎమోషనల్ అయ్యారు. అయితే తాజాగా బర్రెలక్క తండ్రి ఆమె గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేను నా కూతురు శిరీష కు ఎంతో ఘనంగా పెళ్లి చేశాను. ఊర్లో ఎవరు చేయనంతగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపాను. కానీ ఆమె మొగుడితో గొడవ పడి ఇంటికి వచ్చేసింది. బర్లు కొనుక్కొని కాస్తుంది.

అసలు ఆమెకు బర్లు కొనడానికి డబ్బు ఎక్కడిది. ఆ బర్లు కూడా నేను కొన్నవే. ఆబర్లను చూపిస్తూ నన్ను బ్లేమ్ చేసింది. నా కూతురు శిరీష తానే కష్టపడ్డా అని చెబుతుంది. అంతా అబద్ధం అన్ని అబద్ధాలు చెప్పే కంటే విషం పోసుకొని చావు అంటూ ఆమెను నిందించాడు. ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించి ఒక్క రూపాయి అప్పు లేకుండా పెళ్లి చేస్తే భర్తను వదిలి ఇంటికి రావడమే కాకుండా నాపై నిందలు వేస్తున్నావా నీ బ్రతుకు ఎందుకు అంటూ మాట్లాడాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏది ఏమైనా ఒక ఆడపిల్ల రాజకీయ యుద్ధం చేయడానికి రణరంగంలోకి దూకింది. ఆమెకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా వీడియోలను పెడుతూ నెగిటివ్ పెరిగేలా చేస్తున్నారని నెటిజన్స్ అంటున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది