Barrelakka Sirisha : పెళ్లిపీటలపై బర్రెలక్కకు ముద్దు పెట్టిన భర్త.. ఆమె రియాక్షన్ చూస్తే.. వీడియో !

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: March 28, 2024, 3:00 pm
  •  Barrelakka Sirisha : పెళ్లిపీటలపై బర్రెలక్కకు ముద్దు పెట్టిన భర్త.. ఆమె రియాక్షన్ చూస్తే..!

Barrelakka Sirisha  : బర్రెలక్క.. ఇది పేరు కాదు ఓ బ్రాండ్. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ముద్ర అనే చెప్పుకోవాలి. అంతగా 2023 ఎన్నికలను ఆమె ప్రభావితం చేసింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా స్టార్ గా మారిన ఆమె ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బర్రెలకాడికొచ్చిన ఫ్రెండ్స్ అంటూ చేసిన వీడియో అప్పట్లో నిరుద్యోగుల సమస్యలకు అద్దం పట్టింది. దాంతో ఆమెకు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆమె చేసే వీడియోలకు కూడా బాగనే వ్యూస్ వచ్చాయి. నిత్యం బర్లను ముపుకుంటూ ఆమె వీడియోలు చేసింది.

Barrelakka Sirisha 2023 కొల్లాపూర్ ఎమ్మెల్యేగా పోటీ

అలా ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయింది. అది ఒక ఎత్తు మాత్రమే.. కానీ 2023 ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. దెబ్బకు మీడియా మొత్తం ఆమె చుట్టూ చేరిపోయింది. ఆమెకు విపరీతంగా క్రేజ్ సొంతం అయిపోయింది. దాంతో బర్రెలక్క పేరు తెలంగాణ, అటు ఆంధ్రాలో మార్మోగిపోయింది. తెలంగాణలో ఏ నియోజకవర్గానికి రానంత క్రేజ్ కొల్లాపూర్ కు సొంతం అయింది. అందుకే బర్రెలక్క క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయింది.

Barrelakka Sirisha : పెళ్లిపీటలపై బర్రెలక్కకు ముద్దు పెట్టిన భర్త.. ఆమె రియాక్షన్ చూస్తే..!

Barrelakka Sirisha : పెళ్లిపీటలపై బర్రెలక్కకు ముద్దు పెట్టిన భర్త.. ఆమె రియాక్షన్ చూస్తే..!

అప్పటి నుంచి మీడియాకు ఆమె దూరంగానే ఉంటుంది. కానీ మధ్యలో ఆమె మీద చాలా నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఆమె పెద్దగా బయట కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆమె దూరపు బంధువు వెంకటేశ్ అనే వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది బర్రెలక్క. ఆమె ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా బాగానే జరిగింది. సినిమా లెవల్ లో దాన్ని తీశారు. ప్రస్తుతం ఆమె పెల్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. తన పెళ్లికి అందరూ రావాలంటూ ఆమె ఆహ్వానించింది కూడా. అయితే తాజాగా పెళ్లి వేడుకలో ఓ ఘటన జరిగింది.అదేంటంటే.. ఆమెకు పీటల మీదనే ఆమె భర్త నుదుటిపై ముద్దు పెట్టాడు. భర్త అలా ముద్దు పెడుతుంటే బర్రెలక్క సిగ్గుతో కళ్లు మూసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన వారంతా ఆమెకు మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు.

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  2. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  3. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  4. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  5. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

  6. "Scene Movie Review : సీన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp