Bhu Bharati : భూభారతి మార్గదర్శకాలు విడుదల – భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చర్యలు
ప్రధానాంశాలు:
Bhu Bharati : భూభారతి మార్గదర్శకాలు విడుదల - భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చర్యలు
Bhu Bharati : తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల్లో మార్పులు చేయకుండా, ప్రస్తుత భూసమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి సారిస్తూ భూభారతి రూల్స్‌ను తాజాగా విడుదల చేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ మంగళవారం ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటి ద్వారా భూసంబంధిత వివాదాలు ఎక్కడ, ఎలా, ఏ స్థాయిలో పరిష్కరించాలో స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇందులో ప్రత్యేకంగా ఇతర మ్యూటేషన్‌లు, భూధార్ కార్డుల జారీ, పాస్‌బుక్‌ల సవరణలు వంటి అంశాలపై సమగ్రమైన ప్రక్రియలు రూపొందించారు.

Bhu Bharati : భూభారతి మార్గదర్శకాలు విడుదల – భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చర్యలు
Bhu Bharati : భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త చర్యలు
ఇతర మ్యుటేషన్‌లు పరిధిలో కోర్టు ఆర్డర్, లోక్ అదాలత్ అవార్డు, రెవెన్యూ కోర్టు ఆర్డర్, భూదాన్, ఇనామ్ రద్దు వంటి మార్గాల్లో హక్కులు పొందిన వారు ఆధారాలతో కలిసి ఆర్‌డీవోకు దరఖాస్తు చేయాలి. ఆర్‌డీవో నోటీసు జారీ చేసి 7 రోజుల్లో ఆధారాలు స్వీకరించి, 30 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం (స్పీకింగ్ ఆర్డర్) ఇస్తారు. మ్యూటేషన్ ఆమోదమైతే రికార్డులో మార్పులు చేసి పాస్‌బుక్ జారీ చేస్తారు. భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (భూధార్) ఇవ్వడం ద్వారా భూకుల వివరాలను తేలికగా గుర్తించేలా చేస్తారు.
పట్టాదార్ పాస్‌బుక్‌ల కోసం భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్ పరిశీలించి, తప్పులుంటే సరిచేసి పాస్‌బుక్ జారీ చేస్తారు. అంతేకాక రికార్డుల సర్టిఫైడ్ కాపీలను కూడా డిజిటల్ సంతకంతో అందించనున్నారు. ఇవి చట్టపరంగా చెల్లుబాటు అయ్యే విధంగా జారీ అవుతాయి. ఈ మార్గదర్శకాలు అమలులోకి రావడం వల్ల భూములపై స్పష్టత పెరగడంతో పాటు, భూవివాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రజలకు సులభమైన సేవలు అందించడమే ఈ భూభారతి విధాన లక్ష్యం.