Congress : బీఆర్ఎస్‌కు షాకిచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఆ ఐదుగురు కార్పొరేటర్లు.. అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Congress : బీఆర్ఎస్‌కు షాకిచ్చి కాంగ్రెస్‌లో చేరిన ఆ ఐదుగురు కార్పొరేటర్లు.. అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

Congress : బీఆర్ఎస్‌కు భారీ షాక్ మరోసారి తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 10 రోజులే సమయం ఉన్నా కూడా బీఆర్ఎస్ నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. కింది స్థాయి నేత దగ్గర్నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అందరూ కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటీవల మేడ్చల్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 November 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీకి షాక్

  •  కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు

  •  రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

Congress : బీఆర్ఎస్‌కు భారీ షాక్ మరోసారి తగిలింది. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 10 రోజులే సమయం ఉన్నా కూడా బీఆర్ఎస్ నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. కింది స్థాయి నేత దగ్గర్నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అందరూ కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇటీవల మేడ్చల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ విజయం కోసం మేడ్చల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించగా.. ఈ రోడ్ షోకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ తరుపున రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ విజయ భేరి యాత్ర, మేడ్చల్ జనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. మార్పు రావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశామన్నారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు మేడ్చల్ లో బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్ తగిలింది. బోడుప్పల్ కార్పొరేషన్ కు చెందిన బీఆర్ఎస్ ఐదుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ కు బైబై చెప్పి.. కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, బోడుప్పల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్లకు రేవంత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వారిలో 23వ డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, 11వ డివిజన్ కార్పొరేటర్ యాదగిరి, 20వ డివిజన్ కార్పొరేటర్ మహేందర్ యాదవ్, 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేశ్ యాదవ్ ఉన్నారు.

Congress : మేడ్చల్ లో జరిగిన అభివృద్ధి శూన్యం

మేడ్చల్ లో జరిగిన అభివృద్ధి శూన్యం అని.. మల్లారెడ్డి మాత్రం ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పతనం మేడ్చల్ నుంచే ప్రారంభం అవుతుందని, కాంగ్రెస్ రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, మేడ్చల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మల్లారెడ్డిని పండబెట్టుడు ఖాయం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది