Lasya Nanditha : రెండు సార్లు తప్పించుకుంది.. కానీ మూడోసారి మాత్రం.. లాస్య నందితని వెంటాడిన మరణం..!
ప్రధానాంశాలు:
Lasya Nanditha : రెండు సార్లు తప్పించుకుంది.. కానీ మూడోసారి మాత్రం.. లాస్య నందితని వెంటాడిన మరణం..!
Lasya Nanditha : సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గతేడాది అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం ఆయన కూతురికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. ఇక అంతకుముందు కార్పొరేటర్ గా కూడా ఆమె పనిచేయడం జరిగింది. అయితే గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ లో హోరాహోరి పోటీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గద్దర్ కుమార్ వెన్నెల పోటీ చేయగా బీ.ఆర్.ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీచేసి ఘన విజయం సాధించారు. ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
పటాన్ చెర్వు సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డు మార్జిన్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ యాక్సిడెంట్ జరగడానికి అతివేగం మరియు నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పటాన్చెరువు సమీపంలోని సుల్తాన్ పూర్ ఎక్స్ఎల్6 రోడ్డు రైలింగ్ ను కారు డీ కొట్టింది. దీంతోె ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందగా కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటన జరిగిన సమీపంలో అటుగా వెళుతున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని కారు నుంచి బయటకు తీసి పటాన్చెరువు ఆమెథా హాస్పిటల్ కి తరలించారు.అయితే లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత వరుసగా మూడు ప్రమాదాలు జరిగాయని చెప్పాలి. డిసెంబర్ 24న బోయినపల్లి వద్ద లిఫ్టులో ఇరుక్కుపోయి ప్రమాదానికి గురయ్యారు. ఇక ఆ సమయంలో ఆమె సురక్షితంగా బయటకు వచ్చారు.
ఆ తరువాత ఫిబ్రవరి 13న నల్గొండ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఇక ఈ ఘటనలో నల్గొండ జిల్లాకు చెందిన హోంగార్డు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మూడోసారి నల్గొండ రోడ్డు ప్రమాదం తర్వాత లాస్య నందిత సొంతంగా కారు కొనుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిన్న సదాశివపేటలో ఓ ప్రైవేటు పార్టీకి హాజరైన లాస్య ఈరోజు ఉదయం తన స్నేహితుడు ఆకాష్ తో కలిసి తిరిగి ప్రయాణం చేస్తుండగా ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఆమె స్నేహితుడు ఆకాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం జరగడానికి నిద్రమత్తు మరియు అతివేగం కారణమని సమాచారం.