Chalamala Krishna Reddy VS Komatireddy : మునుగోడులో చలమలకు షాక్.. కోమటిరెడ్డికి జైకొట్టిన చలమల అనుచరులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chalamala Krishna Reddy VS Komatireddy : మునుగోడులో చలమలకు షాక్.. కోమటిరెడ్డికి జైకొట్టిన చలమల అనుచరులు

Chalamala Krishna Reddy VS Komatireddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజుల సమయమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. అయితే.. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. మునుగోడు నియోజకవర్గం మరో ఎత్తు. అక్కడి రాజకీయాలు మామూలుగా ఉండవు. అసలు అక్కడి రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కావు. ప్రస్తుతం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •  చలమలకు భారీ షాక్

  •  మునుగోడులో చలమల గెలుపు కష్టమేనా?

  •  మునుగోడు టికెట్ కోసం చలమల కృష్ణారెడ్డి ప్రయత్నాలు

Chalamala Krishna Reddy VS Komatireddy : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజుల సమయమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. అయితే.. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. మునుగోడు నియోజకవర్గం మరో ఎత్తు. అక్కడి రాజకీయాలు మామూలుగా ఉండవు. అసలు అక్కడి రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కావు. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మునుగోడు రాజకీయాలే హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే.. తమ సొంత లాభం కోసం చాలామంది మునుగోడుకు చెందిన నాయకులు పార్టీలు మారారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి.. పార్టీకి రాజీనామా చేసి, తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉపఎన్నిక వచ్చేలా చేశారు. చివరకు బీజేపీ నుంచి అదే మునుగోడులో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి బీజేపీలో అంటీముట్టనట్టుగా ఉన్న కోమటిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల వేళ తిరిగి కాంగ్రెస్ లో చేరారు.

అందుకే.. ఇక్కడ నాయకులు తమకు నచ్చినట్టుగా పార్టీలు మారుతుంటే ఈ నియోజకవర్గం ఓటర్లు కూడా ఎవరికి ఓటేయాలో చాలా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. బీజేపీలోకి వెళ్లి తిరిగి వచ్చిన కోమటిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చాలామంది నియోజకవర్గ స్థాయి నేతలు మండిపడుతున్నారు. మరోవైపు మునుగోడు టికెట్ కోసం చలమల కృష్ణారెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు కానీ.. ఆయనకు టికెట్ దక్కలేదు. పాల్వాయి స్రవంతి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేసినా టికెట్ దక్కలేదు.

Chalamala Krishna Reddy VS Komatireddy : మునుగోడు నుంచి బరిలోకి దిగిన చలమల

అయితే.. చలమలకు ఉపఎన్నికల్లో టికెట్ దక్కలేదు.. ఈ ఎన్నికల్లోనూ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన హస్తం పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ఆయనకు బీజేపీ మునుగోడు నుంచి టికెట్ ఇచ్చింది. ఇక.. తనకు కూడా టికెట్ దక్కలేదని పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చలమల కృష్ణారెడ్డి ఇక బీజేపీ నుంచి ప్రచారం కూడా ముమ్మరం చేశారు. కోమటిరెడ్డిని ఓడించాలన్న కసితో ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు చలమలతో ఉన్న తన ముఖ్య అనుచరులు కొండేటి బ్రదర్స్ సురేశ్ యాదవ్, శ్రీను యాదవ్ ఇప్పుడు చలమలకు గుడ్ బై చెప్పి కోమటిరెడ్డికి జై అంటున్నారు. వాళ్లకు అర్థిక బలం, అంగ బలం ఉండటంతో చలమల గెలుస్తారని అనుకున్నారు. అయితే.. చలమల బీజేపీలో చేరడంతో వాళ్లు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండి కోమటిరెడ్డితో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆయనకే మద్దతు పలకడంతో చలమల గెలుపు మునుగోడులో కష్టంగానే మారింది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది