Home » Exclusive » Cm Kcr Resigned To Chief Minister Post In Telangana
Exclusive

CM KCR Resigned : సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా

Authored By
aruna
The Telugu News | Published on: December 3, 2023, 5:13 pm
Advertisement

CM KCR Resigned : Telangana Elections Results 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు,  తెలంగాణ సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్ భ‌వ‌న్ కి వెళ్లి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి కేసీఆర్ త‌న రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఛేజిక్కించుకోవ‌డంతో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు 60 స్థానాలు గెలుచుకోగా, మ‌రో 5 స్థానాల్లో లీడ్ లో ఉంది.

Advertisement

బీఆర్ఎస్ 31 స్థానాలు గెలిచి 8 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 8 స్థానాలు గెలిచింది. ఎంఐఎం 5 స్థానాల్లో గెలిచి 2 స్థానాల్లో లీడ్ లో ఉంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఇంత‌కుముందే కేసీఆర్ రాజ్ భ‌వ‌న్ కు చేరుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైతో భేటీ అయ్యారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేశారు.

ఇక‌.. మ్యాజిక్ ఫిగ‌ర్ కు చేరుకున్న కాంగ్రెస్ పార్టీ డిసెంబ‌ర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంది. అయితే.. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కు కేసీఆర్.. ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌నున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి