Kumari Aunty : కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్‌.. త్వరలో స్టాల్‌ను సందర్శిస్తానన్న సీఎం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kumari Aunty : కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్‌.. త్వరలో స్టాల్‌ను సందర్శిస్తానన్న సీఎం..!

Kumari Aunty : హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుకునే కుమారి అనే మహిళ సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యారు. రీల్స్, యూట్యూబ్ వీడియోలలో ఎక్కడ చూసినా ఆమె కనిపించేది. గత కొన్ని ల నుంచి అక్కడే షాప్ నడిపిస్తూ ఆమె జీవనం సాగిస్తుంది. ఆమె ఫుడ్ తినడానికి నగరం నలుమూలల నుంచి జనాలు వస్తారు. చాలా తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ పెట్టడం ఆమె ప్రత్యేకత. దీంతో ఆ ప్రాంతంలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2024,3:40 pm

Kumari Aunty : హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ నడుపుకునే కుమారి అనే మహిళ సోషల్ మీడియా ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యారు. రీల్స్, యూట్యూబ్ వీడియోలలో ఎక్కడ చూసినా ఆమె కనిపించేది. గత కొన్ని ల నుంచి అక్కడే షాప్ నడిపిస్తూ ఆమె జీవనం సాగిస్తుంది. ఆమె ఫుడ్ తినడానికి నగరం నలుమూలల నుంచి జనాలు వస్తారు. చాలా తక్కువ ధరకే క్వాలిటీ ఫుడ్ పెట్టడం ఆమె ప్రత్యేకత. దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. దీంతో ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. ఆమె ఫుడ్ పెట్టడానికి పర్మిషన్ లేకపోవడంతో పోలీసులు కుమారి ఆంటీ పై కేసు నమోదు చేశారు. ఇనార్బిట్ మాల్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ దగ్గర్లో ఈ కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ ఉంటుంది. అయితే ఆమె దగ్గర భోజనం చేయడానికి జనంతో పాటు ఫుడ్ వ్లాగర్స్, అలాగే సినీ తారలు సైతం ఆమె వద్దకు వస్తుండడంతో మరింత క్రేజ్ చేకూరింది.

అయితే ఆ పాపులారిటీనే ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాయి. కుమారి ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో భారీగా రద్దీ పెరగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి కుమారి ఆంటీ పై కేసు నమోదు చేశారు. దీంతో ఈ న్యూస్ సంచలనంగా మారింది. అయితే ఈ విషయంలో సీఎంవో జోక్యం చేసుకుంది. ఆమె యధావిధిగా అక్కడ ఫుడ్ ట్రక్ పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది. అంతేకాకుండా త్వరలోనే కుమారి ఆంటీ షాప్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఈ క్రమంలో తనకు పర్మిషన్ ఇవ్వడం పై కుమారి ఆంటీ ఆనందం వ్యక్తం చేశారు. తమ పక్షాన నిలిచినందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాము కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో జనాలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. భారీగా పబ్లిక్ రావడంతో కుమారి ఆంటీ కి రక్షణ కల్పిస్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ కోసం త్వరలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది