Revanth Reddy : ఆయనకే కొత్త డిప్యూటీ సీఎం అవకాశం.. రేవంత్ కేబినేట్‌లో ఎవరికి అవకాశం దక్కనుంది..!
ప్రధానాంశాలు:
Revanth Reddy : ఆయనకే కొత్త డిప్యూటీ సీఎం అవకాశం.. రేవంత్ కేబినేట్‌లో ఎవరికి అవకాశం దక్కనుంది..!
Revanth Reddy : మొన్నటి వరకు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఉండగా, ఇప్పుడు తెలంగాణ Telangana రాజకీయాలు కూడా రసవత్తరంగా మారుతు్ననాయి. అయితే తెలంగాణలో బీసీల కేంద్రంగా తాజా రాజకీయాలు నడుస్తోన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. వారిలో ఒక డిప్యూటీ సీఎం పదవి కూడా ఉంటుందనే టాక్ నడుస్తుంది. ఎస్టీ, మైనార్టీ, రెడ్డి, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్ లోకి ఎంపిక చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Revanth Reddy : ఆయనకే కొత్త డిప్యూటీ సీఎం అవకాశం.. రేవంత్ కేబినేట్‌లో ఎవరికి అవకాశం దక్కనుంది..!
Revanth Reddy ఎవరికి దక్కనుంది..
ఢిల్లీ వెళ్లిన రేవంత్ కేబినెట్ విస్తరణ.. నామినేటెడ్ పదవులు.. పీసీసీ కార్యవర్గం పై చర్చించనున్నారు. ఇదే సమయంలో రేవంత్ కేబినెట్ లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలనే ప్రతిపాదన పైన ఆసక్తి కర చర్చ మొదలైంది. రేవంత్ మంత్రాంగం తెలంగాణ కాంగ్రెస్ Congress లో కొందరు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో, ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం కావాలని రేవంత్ నిర్ణయించారు. బీసీ నేతకు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలనే భావిస్తోన్న సీఎం రేవంత్ ఆ పదవిని పొన్నం ప్రభాకర్‌కు కట్టబట్టే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
పొన్నం ప్రభాకర్ Ponnam Prabhakar కి ఆ శాఖతో పాటుగా డిప్యూటీ సీఎం బాధ్యతలను కూడా కల్పించనున్నారని తెలుస్తోంది. ఇక బీసీకి సామాజిక వర్గం, ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన నీలం మధుకు కూడా మంత్రి పదవి దక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ కేబినేట్ లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో భట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉండేలా హైకమాండ్ నిర్ణయించింది. కాగా, బీసీల కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయం మారుతోంది. బీజేపీ సైతం బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చింది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు సైతం బీసీకే ఇస్తారని సమాచారం. దీంతో, బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎంగా డిప్యూటీతో పాటుగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నిర్ణయిస్తే ముదిరాజ్ వర్గానికి కేటాయిస్తారని టాక్ నడుస్తుంది. పీసీసీ కొత్త కార్యవర్గం సైతం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.