Revanth Reddy : నీ అయ్య కేసీఆర్ నడిరోడ్డుపై బట్టలిప్పి కొట్టిస్తా… రేవంత్ రెడ్డి…!
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వెళ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇక అక్కడే ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చూసి కేసీఆర్ కల్లు మండిపోతున్నాయని తెలియజేశారు. పదేళ్ల కెసిఆర్ పాలనలో మెదక్ జిల్లాకు కనీసం ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా దుబ్బాకకు మోడీ ప్రభుత్వం ఎన్ని నిధులను మంజూరు చేసిందో చెప్పాల్సిందిగా రఘునందన్ రావు కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
Revanth Reddy : రైతులకు రుణమాఫీ…
ఆగస్టు 15 లోపు రైతులందరికీ కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాక వచ్చే వరి పంటకు కూడా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని తెలియజేశారు.ప్రజల కష్టాలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా తీసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు.ఈ నేపథ్యంలోనే హస్తం పార్టీపై ప్రతిపక్షాలు చేయి వేస్తే మాడిపోతారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలకు ప్రతి నిమిషం అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాబట్టి కాంగ్రెస్ ను అఖండ మెజారిటీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయాల్సిందిగా కోరారు.
గత పది ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని, ఢిల్లీలో రైతులనుచంపిన బీజేపీ మి బొంద పెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మను గెలిపించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు .ఇందిరాగాంధీ హైదరాబాద్ కు అనేక రకాల పరిశ్రమలు అందించారని బీహెచ్ఈఎల్, బీడీఎల్ , ఇక్రిషాట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం కు ఉందని తెలియజేశారు.ఇక ఇప్పుడు మెదక్ జిల్లాలో పేద ముదిరాజ్ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చామని , అతని గెలిపించే బాధ్యత మీదేనంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.