CM Revanth Reddy : మరో 15 ఏళ్లు రేవంతే సీఎం.. ఇదే సాక్ష్యం
ప్రధానాంశాలు:
మరో రెండు టర్మ్స్ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా
రేవంత్ పాలనను మెచ్చుకుంటున్న తెలంగాణ ప్రజలు
రేవంత్ రాజకీయ మార్క్ అదుర్స్
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 10 రోజులు దాటి పోయింది. ఈ 10 రోజుల్లోనే తెలంగాణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి గత 10 ఏళ్ల పాటు పాలించి కూడా ఇలాంటి నిర్ణయాలను బీఆర్ఎస్ తీసుకోలేకపోయింది. అలాంటి నిర్ణయాలను క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొని పాలనలో తనదైన మార్కును చూపించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని వల్ల చాలామంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. అయితే.. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన పాలన విధానం చూస్తే ఇప్పుడే కాదు మరో 15 నుంచి 20 ఏళ్ల వరకు ఆయనే సీఎంగా ఉండే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే తెలంగాణ ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చారు. సామాన్యులకు ప్రజా భవన్ లోకి అనుమతి ఇచ్చి వాళ్ల వినతులను స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలతో మమేకం అయి వారి నుంచి వినతులను స్వీకరించడం రేవంత్ లోని ప్రజా నేతను బయటికి తీసుకొచ్చింది. అలాగే కీలక శాఖలపై సమీక్ష చేసి గత ప్రభుత్వ ఒప్పందాలు, కోట్లాది రూపాయల ఖర్చుపై విచారణకు ఆదేశించారు. అంతే కాకుండా వివిధ శాఖలపై జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా శ్వేత పత్రాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
CM Revanth Reddy : కేసీఆర్ ను పరామర్శించి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించిన రేవంత్ రెడ్డి
మరోవైపు కేసీఆర్ ను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించి రేవంత్ రెడ్డి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు తాను చోటు ఇవ్వనన్న సంకేతాలను బలంగా పంపారు. పార్టీ కింది స్థాయి కేడర్ కు కూడా అదే స్థాయి సిగ్నల్స్ పంపి గ్రామాల్లో శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా చూశారు. ప్రజా వాణి కార్యక్రమాన్ని పునరుద్దరించి ప్రజా సమస్యలను పరిష్కరించబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచారు రేవంత్ రెడ్డి. 10 రోజుల్లోనే ఇంత చేస్తే ఇక మున్ముందు రేవంత్ ప్రభుత్వం ఇంకెన్ని మంచి పనులు చేస్తుందో అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన పాలన విధానాన్ని చూస్తుంటే ఓ 15 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని ప్రజలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.