Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్.. ఆ పదవి కన్ఫమ్.. వెంటనే పార్టీలో చేరనున్న మల్లన్న | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్.. ఆ పదవి కన్ఫమ్.. వెంటనే పార్టీలో చేరనున్న మల్లన్న

 Authored By kranthi | The Telugu News | Updated on :7 November 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  ఎమ్మెల్యే టికెట్ కి నో కానీ.. ప్రచారానికి ఓకే చెప్పిన కాంగ్రెస్

  •  ఈసారి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి తీన్మార్ మల్లన్న

  •  పార్టీ గెలిస్తే కీలక పదవి

Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించే వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం తీన్మార్ మల్లన్న అనే చెప్పుకోవాలి. అధికార పార్టీని గడగడలాడించే సత్తా ఉన్న వ్యక్తి తీన్మార్ మల్లన్న. ప్రజల సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే గొప్ప గుణం ఉంది ఆయనకు. అందుకే.. తెలంగాణలో తీన్మార్ మల్లన్నకు మంచి గుర్తింపు ఉంది. మరోవైపు తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇంకో 24 రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు ముగుస్తాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఈసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఇతర పార్టీల నుంచి కీలక నేతలు కాంగ్రెస్ కి క్యూ కడుతున్నారు. బీజేపీ నుంచి కూడా కీలక నేతలు వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ కి రోజురోజుకూ బలం పెరుగుతోంది. ఇంకా పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎంపీ టికెట్ కోసమో, లేక పార్టీలో వేరే పదవుల కోసం చూసేవాళ్లు ఉన్నారు. ఒకవేళ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ప్రభుత్వం ఏర్పడితే ఏదైనా పదవి దక్కకపోతుందా అని అనుకునేవాళ్లూ ఉన్నారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ దూకుడుమీదుంది. అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ ఎలాగూ హ్యాట్రిక్ సాధించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలో కాంగ్రెస్ బలం ఒక్కసారిగా పెరగడంతో కాంగ్రెస్ క్రేజ్ ను చూసి బిత్తరపోతోంది. కాంగ్రెస్ వైపు కూడా జనాలు ఉండటంతో బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా అవుతోంది. అందుకే తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. కొందరు నేతలకు కాంగ్రెస్ లో చేరిన వారికి టికెట్లు కూడా ఇచ్చింది కాంగ్రెస్. అయితే.. మేడ్చల్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అవన్నీ ఉత్తవే అని తెలిసింది. మేడ్చల్ లేదా సిరిసిల్ల నుంచి పోటీ చేయాలనుకున్నారట. ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ తనకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ.. ఎమ్మెల్యే టికెట్ మాత్రం తీన్మార్ మల్లన్నకు ఇవ్వలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

Teenmaar Mallanna : పార్టీ గెలిస్తే కీలక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్లాన్

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే తీన్మార్ మల్లన్నకు కీలక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నకు ప్రచార బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత పార్టీ గెలిస్తే కీలక పదవి ఇస్తామని చెప్పడంతో తీన్మార్ మల్లన్న కూడా ఈ వారమే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది