Congress Party : అధికారం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వీటిని గమనించాల్సిందే.. లేకపోతే.. అంతే..!
ప్రధానాంశాలు:
Congress Party : అధికారం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వీటిని గమనించాల్సిందే.. లేకపోతే.. అంతే..!
Congress Party : అధికారం దక్కించుకోవడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతకంటే ఎక్కువ కష్టం అని చెప్పాలి. మాటల తో కాదు చేతల్లో కూడా చేసి చూపాలి. ముంచుకు వచ్చిన ముంపుని సైతం కనిపెట్టగలగాలి. అప్పుడే అధికారం లో పై చెయ్యి కొనసాగుతుంది. ఇక ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందు ఉన్న సమస్యలు దాదాపు ఎలాగే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇక ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాలేశ్వరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ సర్కార్ కు అంది వచ్చినా అవకాశంల మారింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంటేషన్లు, ప్రాజెక్టులు ,టూర్లు అసెంబ్లీ చర్చలతో గత ప్రభుత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం విరుచుకు పడింది. చివరికి ప్రతిపక్షం కాలేశ్వరం అంటే ఒక మేడిగడ్డ నేనా నాగార్జున సాగర్ కి బీటలు బారలేదా.. తప్పు జరిగితే బాగు చేసుకోరా అంటూ డిఫెన్స్ లోకి నెట్టింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే పండగ చేసుకోవచ్చా అంటే ముంచుకొచ్చే ప్రమాదాలు ఏమీ లేవా ఇటు బిఆర్ఎస్ అటు బిజెపి చూస్తూ ఊరుకుంటాయా. రాజకీయ పార్టీలుగా వాటి వ్యూహాలు ఏంటి..? జనాలకి పనికి వచ్చే పనులు చేసినంత మాత్రాన అధికారం నిలబడదు. ముంచుకొస్తున్న ముప్పు నుంచి కూడా జాగ్రత్త పడాలి. విపక్షాల వ్యూహాన్ని తిప్పి కొట్టాలి. అప్పుడే ఏ ప్రభుత్వమైనా సాఫీగా నడుస్తుంది. అయితే రాజకీయంగా వచ్చే ఇబ్బందులు కష్టాలను కూడా ముందు చూపుతో చూడగలగాలి. అయితే అధికారం లోకి వచ్చాక రేవంత్ రెడ్డి తానే పదేళ్లుగా సీఎంగా ఉంటాను అని అంటున్నారు. అలా ఉండాలి అంటే దానికి అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
ఈ ప్రభుత్వానికి ఉన్న బలం ఎంత అని మొదట్లోనే బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ ఉండేది నాలుగు రోజులే అని చాలామంది టీ.ఆర్.ఎస్ బీ.జే.పీ నేతలు బహిరికంగానే కామెంట్లు చేశారు. ఇక దీనిపై కాంగ్రెస్ పార్టీ రివర్స్ అయినప్పటికి ప్రభుత్వ ఉండేది 6 నెలలే అని ఏడాదిలోపే కుప్పకూలుతుంది అనే కామెంట్లు మాత్రం ఆగలేదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ప్రభుత్వం పడిపోవడం పెద్ద విషయం ఏమీ కాదు ప్రభుత్వాన్ని పడగొట్టడం ఒక దినచర్య. రాజకీయం మారిన కాలం ఇది. ఒకప్పుడు దీన్ని తప్పు పట్టే వారేమో కానీ ఇప్పుడు ఆ తప్పులను గమనించే వాళ్ళు ఎవరూ లేరు. ఇది అంత రాజకీయంగా సహజమే కదా అని అనుకుంటున్నారు. ఎవరికి బలం ఉంటే వాళ్లదే అధికారం అని జనం కూడా అనుకుంటున్నారు. అయితే బీహార్ అంతకుముందు మహారాష్ట్రలో గతంలో కర్ణాటకలో కూడా ఒక్కరోజులో రాజకీయాలు మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అధికార పీఠాలు కూడా కదిలిపోయాయి. అందుకే ఒక ప్రభుత్వం పడిపోవడానికి ఈ రోజుల్లో ఎన్నికల వరకు అవసరం లేదు. ఒక పదిమంది ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే చాలు ప్రభుత్వాలు కుప్పకూలి పోతాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ గమనించాలి. తనకి ఏ అవకాశం ఉన్న సరే బీ.జే.పీ పార్టీ చూస్తూ ఊరుకోదని అధికారం చేజికించుకోవడానికి వెనకాడదు అని అనేక సందర్భాలలో రుజువు అవుతుంది.
అయితే ఇప్పుడు ఒక 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి జారుకుంటే జరిగేది ఏంటి ఎవరు ఎవరిని స్పేర్ చేయరు. అదును కోసం చూడడం తప్ప. ఇదే నేటి రాజకీయాల్లో జరిగే మరో కోణం. నాయకుడు పార్టీలకు ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారంలో ఉన్న లేకపోయినా ఇతర వ్యక్తులు ఉన్న లేకపోయినా దూకేయడం పెద్ద విషయమేమీ కాదు. అదే సమయంలో శత్రువు శత్రువు మిత్రుడు అని అప్పుడు అన్నమాట ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తుంది. నిన్నటిదాకా బీ.ఆర్.ఎస్ కు బీ.జే.పీ శత్రువు. అలాగే బీ.జే.పీ కాంగ్రెస్ కి కూడా శత్రువు. దీంతో ఇప్పుడు టీ.ఆర్.ఎస్ బీ.జె.పీ మిత్రుల అవ్వడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది అనే విషయం ఇప్పుడే చెప్పలేము కానీ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ అనివార్యతను కాంగ్రెస్ గుర్తించాలి.తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ 64 మంది సభ్యుల బలం ఉంది. బీ.ఆర్.ఎస్ కు 30 , బీ.జె.పీ కి 8, ఎంఐఎం కి 7 సభ్యులు ఉన్నారు. అంటే టీఆర్ఎస్ బీజెపీ ఎంఐఎం కలిస్తే మొత్తం 54 మంది సభ్యులవుతారు. అంటే ఒక 5-6 సభ్యులు అటు నుంచి ఇటు దూకితే కాంగ్రెస్ పని గోవింద అని చెప్పాలి.మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.