MLA Vemula Veeresham : ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసిందో ఎవరో తెలిసింది
ప్రధానాంశాలు:
MLA Vemula Veeresham : ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసిందో ఎవరో తెలిసింది
MLA Vemula Veeresham : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం క్రితం కొందరు దుండగులు ఎమ్మెల్యే ఫోన్ నంబర్‌కు న్యూడ్ వీడియో కాల్ చేసి, అనంతరం వాట్సాప్ ద్వారా స్క్రీన్ రికార్డు పంపి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

MLA Vemula Veeresham : ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసిందో ఎవరో తెలిసింది
పోలీసుల విచారణలో నిందితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న నేరస్తులను ట్రాక్ చేసిన తెలంగాణ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేసిన అనంతరం నకిరేకల్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం నిందితులను నల్గొండకు తరలించిన పోలీసులు, వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ రోజు నిందితులను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అపరిచిత నంబర్ల నుండి వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఈ కేసు మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.