Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భరత్‌నగర్ మాలబస్తీలో రూ.1.70 కోట్లతో అభివృద్ధి పనులు.. : రజితాపరమేశ్వర్ రెడ్డి
ప్రధానాంశాలు:
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భరత్‌నగర్ మాలబస్తీలో రూ.1.70 కోట్లతో అభివృద్ధి పనులు.. : రజితాపరమేశ్వర్ రెడ్డి
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్‌రెడ్డి Rajitha Parmeshwar Reddy పేర్కొన్నారు. డివిజన్‌లోని మురికివాడల అభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్టుగా చెప్పారు. డివిజన్‌లోని భరత్‌నగర్ మాలబస్తీలో రూ.1.70 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను రజితపరమేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భరత్‌నగర్ మాలబస్తీలో రూ.1.70 కోట్లతో అభివృద్ధి పనులు.. : రజితాపరమేశ్వర్ రెడ్డి
Rajitha Parameshwar Reddy పనులను పరిశీలించిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి
మాలబస్తీలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని రజితాపరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇవే కాకుండా మరో రూ.1.60 కోట్లతో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలను శుభ్రం చేయిస్తున్నట్టుగా చెప్పారు. ఇవే కాకుండా డివిజన్‌లో మిగతా అన్ని కాలనీలలోనూ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నట్టుగా తెలిపారు.
కార్యక్రమంలో ఈ ఈ హరిలాల్ నాయక్ గారు, డి ఈ వినీల్ గారు,ఏఈ మౌనిక గారు, సల్ల ప్రభాకర్ రెడ్డి , గొరిగే మహేష్ ,రామ్ రెడ్డి, కృష్ణారెడ్డి, బూత్కూరి మదన్ గౌడ్, కిషోర్, ప్రశాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,వహీద్, మరియు కాలనీవాసులు పాల్గొన్నారు