Dundigal BJP : బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా “తలారి రాజ్ కుమార్” నియామ‌కం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dundigal BJP : బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా “తలారి రాజ్ కుమార్” నియామ‌కం..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2025,11:14 pm

ప్రధానాంశాలు:

  •  Dundigal BJP : బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా "తలారి రాజ్ కుమార్" నియామ‌కం..!

నిత్యం జనాల్లో ఉంటూ… ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా అంటూ ముందుకు వచ్చే BJP Party భారతీయ జనతా పార్టీ డైనమిక్ లీడర్ Talari Raj Kumar తలారి రాజ్ కుమార్ సేవలను అధిష్టానం గుర్తించింది. ఈ తరుణంలోనే ప్రజల కోసం నిత్యం ఆరాటపడే తలారి రాజ్ కుమార్ కు.. దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా కీలక పదవి కట్టబెట్టింది. ఇందులో భాగంగానే… బిజెపి పార్టీ కార్యదర్శి నియామక పత్రాన్ని.. మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ చేతుల మీదుగా తలారి రాజ్ కుమార్ అందుకున్నారు.

Dundigal BJP బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తలారి రాజ్ కుమార్ నియామ‌కం

Dundigal BJP : బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా “తలారి రాజ్ కుమార్” నియామ‌కం..!

దుండిగల్ మున్సిపాలిటీ dundigal municipality BJP బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన గండి మైసమ్మ చౌరస్తా శ్రీ సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో… వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు Etela Rajender  ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా… దుండిగల్ మున్సిపల్ బిజెపి పార్టీ కార్యదర్శిగా తలారి రాజ్ కుమార్ ఎంపికైన నేపథ్యంలో నియామక పత్రాన్ని అందజేశారు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. అనంతరం ఈటల రాజేందర్ మాట్లాడుతూ… బిజెపి పార్టీ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉండి.. ఎన్నో గొప్ప విజయాలను అందుకుందని వెల్లడించారు. బిజెపి నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. తాజాగా ఎంపికైన నూతన మున్సిపల్ బిజెపి కమిటీ నాయకులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. నిత్యం లీడర్లందరూ జనాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.

Dundigal  BJP పార్టీకి రాజ్ కుమార్ Talari Raj Kumar ప్రత్యేక ధన్యవాదాలు

ప్రపంచం లో అతిపెద్ద కార్యకర్తలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ (BJP) తరపున దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గా నన్ను ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు తలారి రాజ్ కుమార్. మన పార్టీ బలోపేతం కోసం నాకు అప్పగించిన బాధ్యతను నిజాయితీగా స్వీకరించి, నిర్వాహస్తానని తెలియ చేస్తున్నానన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు జిల్లా ఇంచార్జ్, అధ్యక్షులు శ్రీ Dr S.మల్లారెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసారి కృష్ణరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అద్యక్షులు గోనె మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్ చారి, రాష్ట్ర ST మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, ఆకుల మల్లేష్, ప్రభాకర్ రెడ్డి, గీతాసెల్ అధ్యక్షులు శ్రీ వెంకటేష్, మల్లేష్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈదులకంటి నర్సింహ గౌడ్, వెంకటేష్ నాయక్,పిట్ల లక్ష్మణ్ ,డి.సీతారాం రెడ్డి,ఆకుల విజయ్ ,తురాయి భాను గౌడ్,ఏలూరి శ్రీధర్ గౌడ్, ఆకుల యశ్వంత్, ఏలూరి విష్ణు, అనిల్ ముదిరాజ్ ,శ్రీకాంత్ ,గగిలాపూర్ చిన్న,నవీన్ ,నాగేంద్ర బాబు,కిరణ్,సాయి, సోను,మహేందర్,నిఖిల్ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది