KTR : కేటీఆర్‌ని చుట్టుముట్టేసిన ఫార్ములా ఈ రేసు కేసు.. ఏం జరగనుంది..!
ప్రధానాంశాలు:
KTR : కేటీఆర్‌ని చుట్టుముట్టేసిన ఫార్ములా ఈ రేసు కేసు.. ఏం జరగనుంది..!
KTR : Formula E race గత కొద్ది రోజులుగా తెలంగాణ Telangana రాజకీయం రంజుగా మారింది. బీఆర్ఎస్ BRS వర్సెస్ కాంగ్రెస్ Congress నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీబీఐ కేసు నమోదు చేయగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్‌కు వరుస షాక్‌లు మీద షాకులు తగులుతున్నాయి. సీబీఐ కేసులో హైకోర్టు ఉత్తర్వులతో ఉపశమనం లభించిన కొన్ని గంటలకే ఈడీ కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. త్వరలోనే ఈడీ నుంచి కేటీఆర్‌కు నోటీసులు అందనున్నాయి. తెలంగాణ ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కు హైదరాబాద్ ఈడి జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు…
KTR ఈడీ పట్టు..
ఏసీబీ డీజీకి ఈడీ లేఖలో కీలక విషయాలు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనే నమోదైన కేసు వివరాలను తమకు అందజేయాలని ఆ లేఖలో హైదరాబాద్ ఏడి జాయింట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ తో పాటుగా హెచ్ఎండిఏ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులను బదిలీ చేశారు అని పూర్తి వివరాలు కూడా కావాలని ఆయన పేర్కొన్నారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిపై కూడా ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన కేసు మాదిరిగా ఈడీ కేసు ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్టు అవుతారని తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో కేటీఆర్ ఏ వన్ కాగా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ 2 గా ఉన్నారు. మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణాన అయినా ఆయనను అరెస్ట్ చెయ్యొచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పైన మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.