kaleshwaram project : కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల..కేసీఆర్ కు చిక్కులు తప్పవా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

kaleshwaram project : కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల..కేసీఆర్ కు చిక్కులు తప్పవా..?

 Authored By aruna | The Telugu News | Updated on :6 June 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  kaleshwaram project : కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల..కేసీఆర్ కు చిక్కులు తప్పవా..?

kaleshwaram project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల, ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మొత్తం 24 కీలక ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రాజెక్టు నిర్మాణం, నిధుల కేటాయింపు, డిజైన్ మార్పులు వంటి అంశాలపై వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా కేబినెట్ నిర్ణయాల మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని, సాంకేతిక మరియు కేబినెట్ కమిటీల సూచనలతో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

kaleshwaram project కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల

kaleshwaram project కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెలకేసీఆర్ కు చిక్కులు తప్పవా

kaleshwaram project : కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల..కేసీఆర్ కు చిక్కులు తప్పవా..?

 

ఇక ప్రాజెక్టు లొకేషన్‌ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ఈ మార్పు జరిగిందని పేర్కొన్నారు. అలాగే నిధుల కొరత కారణంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని ప్రాజెక్టు డీపీఆర్‌లో ఉన్నా, వాస్తవంగా వసూలు జరగలేదని వివరించారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిందా అనే ప్రశ్నకు, ఆ అంశాలు నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తాయని సమాధానమిచ్చారు.

ముఖ్యంగా ప్రాజెక్టుతో సంబంధిత పూర్తి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు వద్దే ఉందని ఈటల పేర్కొనడం గమనార్హం. తాను ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి అన్ని వివరాలు తనకు తెలియవని స్పష్టం చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి హరీష్ రావే ఛైర్మన్‌గా ఉన్నారనీ, తమ పాత్ర చాలా పరిమితమైనదని చెప్పారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ ప్రభుత్వంపై దృష్టి మరింతగా కేంద్రీకృతమవుతోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది