kaleshwaram project : కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల..కేసీఆర్ కు చిక్కులు తప్పవా..?
kaleshwaram project : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటల, ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మొత్తం 24 కీలక ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రాజెక్టు నిర్మాణం, నిధుల కేటాయింపు, డిజైన్ మార్పులు వంటి అంశాలపై వివరాలు వెల్లడించారు. ముఖ్యంగా కేబినెట్ నిర్ణయాల మేరకే ఆనకట్టల నిర్మాణం జరిగిందని, సాంకేతిక మరియు కేబినెట్ కమిటీల సూచనలతో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
kaleshwaram project : కాళేశ్వరం కమిషన్ ఎదుట ప్రాజెక్ట్ గుట్టంతా విప్పిన ఈటెల..కేసీఆర్ కు చిక్కులు తప్పవా..?
ఇక ప్రాజెక్టు లొకేషన్‌ను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర అభ్యంతరాల దృష్ట్యా ఈ మార్పు జరిగిందని పేర్కొన్నారు. అలాగే నిధుల కొరత కారణంగా కాళేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారని, పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయాలని ప్రాజెక్టు డీపీఆర్‌లో ఉన్నా, వాస్తవంగా వసూలు జరగలేదని వివరించారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిందా అనే ప్రశ్నకు, ఆ అంశాలు నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తాయని సమాధానమిచ్చారు.
ముఖ్యంగా ప్రాజెక్టుతో సంబంధిత పూర్తి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు వద్దే ఉందని ఈటల పేర్కొనడం గమనార్హం. తాను ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి అన్ని వివరాలు తనకు తెలియవని స్పష్టం చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి హరీష్ రావే ఛైర్మన్‌గా ఉన్నారనీ, తమ పాత్ర చాలా పరిమితమైనదని చెప్పారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలతో కేసీఆర్ ప్రభుత్వంపై దృష్టి మరింతగా కేంద్రీకృతమవుతోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.