Organs : మరణిస్తూ… మరొకరికి వెలుగులు
ప్రధానాంశాలు:
వృద్ధుడి అవయవాలు దానం చేసిన కుటుంబసభ్యులు
Organs : తాను చనిపోతూ ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాడో వృద్ధుడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయలైన వృద్దుడు బ్రెయి న్‌డెడ్ కావడంతో కుటుంబసభ్యులు అవయవాలు దానం చేశారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలోని మాణిక్యాలమ్మ గూడేనికి చెందిన బంటు అంజయ్య(62) ఈ నెల 14న ఉదయం సైకిల్‌పై వ్యవసా ‘యబావి వద్దకు బయలుదేరాడు.
నార్కట్‌పల్లి వైపునుంచి కట్టంగూరు. వైపు వస్తున్న ద్విచక్రవాహనదారుడు మాణిక్యాలమ్మగూడెం వద్దకు రాగానే సైకిల్‌పై వెళ్తున్న అంజయ్యను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయలైన అంజయ్యను కుటుంబసభ్యులు చికిత్స నిమ్తితం హైదరాబాద్‌లోని కామినేని ఆస్ప తికి తరలించారు.
బ్రేయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు డాక్టర్లు గుండె, కిడ్నీలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెలే వేముల వీరేశం మృతుడి కుటుంబసభులను పరామర్శించారు.