Free Current : ఉచిత కరెంట్.. సీఎం రేవంత్ రెడ్డికి షాక్..!
ప్రధానాంశాలు:
Free Current : ఉచిత కరెంట్.. సీఎం రేవంత్ రెడ్డి షాక్..!
Free Current : కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం రెండు హామీలను అమలు చేసింది. మరో రెండు పథకాలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి పథకం ఒకటి. ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వానికి మీటర్ రీడర్లు జలక్ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వివరాలు నమోదు చేసుకోమని తేల్చి చెప్పారు. తమకు నెల అంతా పని కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల నమోదు పనిని గుత్తేదారులకు ఇవ్వాలంటున్నారు. ఉచిత విద్యుత్ అమలు కోసం వినియోగదారుల ఫోన్, ఆధార్, రేషన్ కార్డ్ నెంబర్లను సేకరించాలన్నారు.
ప్రజా పాలనలో ఉచిత కరెంటు కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో 30% మంది ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్లను సరిగా నమోదు చేయలేదని తేలింది. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో ఉచిత కరెంట్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గృహజ్యోతి పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారిలో పది లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా ఇవ్వడం సాధ్యం కాదని సమాచారం.
రాష్ట్రమంతటా విద్యుత్ సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియ పూర్తి అయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే దానిపై ప్రాథమికంగా లెక్కలు తేలనున్నాయి. ఈ ఉచిత కరెంట్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి లభిస్తుంది. అలాగే ఒక ఇంటికి ఒక మీటర్ ఉన్నవారికి పథకం అమలు అవుతుంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు సైతం ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకం వర్తించాలంటే వారు 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగం చేసే వారై ఉండాలి. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 2181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి. ఒక వినియోగదారుడు 1500 యూనిట్లు కరెంటు వాడితే దానికి 10% కలిపి 12 నెలలకు దానికి 10% కలిపి ఆ మొత్తం కరెంటును 12 నెలలకు విభజించి ఆ యూనిట్లను మాత్రమే ఉచితంగా ఇస్తారు. మిగతాది లెక్క కడతారు. ప్రతినెల మీటర్ రీడింగ్ తో పది రోజులు పాటు మొదటి వారంలోని ఉచిత విద్యుత్ లబ్ధిదారులు గుర్తింపు ఉంటుంది. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్ కు రేషన్ కార్డ్ , ఆధార్ కార్డ్ , మొబైల్ నెంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధంగా కరెంట్ ఫ్రీగా ఇచ్చే లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు.