Free Current : గుడ్ న్యూస్.. ఉచిత కరెంట్ పథకం పై కీలక అప్ డేట్.. ఇలా చేస్తేనే కరెంటు ఫ్రీ..!
ప్రధానాంశాలు:
Free Current : గుడ్ న్యూస్.. ఉచిత కరెంట్ పథకం పై కీలక అప్ డేట్.. ఇలా చేస్తేనే కరెంటు ఫ్రీ..!
Free Current : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది.ఇప్పటివరకు రెండు పథకాలను అమలు చేశారు.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల భీమాను కల్పించారు. మిగిలిన పథకాల అమలుపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించింది. ఆరోగ్యానికి ఒకే ఫారాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ప్రజా పాలన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అందరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ దరఖాస్తులను డీజిలైజ్ చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను తీసుకుంటారు.
లబ్ధిదారుల ఎంపిక తర్వాత మహిళలకు నెలకు రూ.2500, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేస్తారు. అయితే ఇందులో ఉచిత కరెంటు పథకానికి సంబంధించి కీలక వివరాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తమ మేనిఫెస్టోలో కాంగ్రెస్ తెలిపింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పథకం అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఉచిత కరెంటు పథకం వర్తించాలంటే బకాయిలు ఉండకూడదు అని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడంతో చాలామంది డిసెంబర్, జనవరి బిల్లులు కట్టలేదు.
వారంతా పెండింగ్ బిల్లులను కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి బకాయిలు లేని వారికి ఉచిత కరెంట్ వస్తుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చినందున డిసెంబర్, జనవరి బిల్లులను మాఫీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ప్రజా పాలన దరఖాస్తులు ఎన్ని యూనిట్ల కరెంటు వాడుతారు..మీటర్ కనెక్షన్ నెంబర్ ఎంత..అనే వివరాలు మాత్రమే అడిగారు. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాతే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.