BC Dedicated Commission Report : బ్రేకింగ్.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు రెడీ..!
ప్రధానాంశాలు:
BC Dedicated Commission Report : బ్రేకింగ్.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు రెడీ..!
BC Dedicated Commission Report : కులగణన కోసం Telangana Govt తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ తన రిపోర్టును BC Dedicated Commission Report ప్రభుత్వానికి అందజేసింది. కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు Bhusani Venkateswara Rao ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని cs shanthi kumari కలిసి 700 పేజీలతో నివేదిక అందజేశారు. రిపోర్టును బీసీ సంక్షేమ శాఖకు పంపనున్నారు. కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.
![BC Dedicated Commission Report బ్రేకింగ్ స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు రెడీ](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/BC-Dedicated-Commission-Report.jpg)
BC Dedicated Commission Report : బ్రేకింగ్.. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు రెడీ..!
BC Dedicated Commission Report : స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల రిపోర్టు రెడీ..!
గ్రామం ఒక యూనిట్ గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు అందుబాటులోకి రావాలని నివేదకలో పేర్కొంది. అలాగే మండలం ఒక యూనిట్ గా ఎంపీటీసీ రిజర్వేషన్లు అందుబాటులోకి రావాలని తెలిపింది. జిల్లాను ఒక యూనిట్ గా జెడ్పీటీసీల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లుగా రిపొర్టులో పేర్కొంది. రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని.. జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ ను పంచాయతీ రాజ్ శాఖ Panchayat Raj Department ఖరారు చేసింది. అసెంబ్లీ సెగ్మంట్లు వారిగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని కమిషన్ సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరు సెగ్మంట్లు రూపంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినట్లు సమాచారం. డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూడు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ల కల్పన కోసం రాజకీయంగా వెనుకబడిన వర్గాల(బీసీ-బ్యాక్ వర్డ్ క్లాసెస్) జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకంగా గతేడాది నవంబర్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ భూసాని వెంకటేశ్వర రావు నేతృత్వంలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ ను నియమించింది.