Crime News : అంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకోవాలా? వరంగల్ లో 15 ఏళ్ల బాలిక బలవన్మరణం
Crime News : చాలామంది పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా చిన్న సమస్య వస్తే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక సమస్యకు ఆత్మహత్యే శరణ్యం అంటే.. ఈ ప్రపంచంలో మానవజాతి మిగిలి ఉండదు. అవును.. సమస్యలు లేని వాళ్లు ఎవ్వరూ ఉండరు. కానీ.. చిన్న సమస్యను కూడా తట్టుకోలేక ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. లవ్ ప్రాబ్లమ్ వచ్చినా.. చదువు సమస్య ఉన్నా, ఉద్యోగం లేదని, డబ్బులు లేవని, పెళ్లి కాలేదని, ఆరోగ్యం బాగోలేదని.. ఇలా రకరకాల సమస్యలతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వరంగల్ లో చోటు చేసుకుంది.
వరంగల్ దగ్గర్లోని సూరారం అనే గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాసిని అనే 15 ఏళ్ల బాలిక పెద్ద కూతురు. ఆమె హసన్ పర్తిలో ఓ స్కూల్ లో చదువుతోంది. అయితే.. ఇటీవల నిర్వహించిన ఓ పరీక్షలో హాసినికి తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి హాసిని మనస్థాపానికి గురయింది. అయితే.. ఆ తర్వాత సంక్రాంతి సెలవులు వచ్చాయి.
Crime News : సెలవుల అనంతరం స్కూల్ కు వెళ్లని హాసిని
అయితే.. సంక్రాంతి సెలవుల అనంతరం హాసిని స్కూల్ కు వెళ్లలేదు. కానీ.. ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం తనను స్కూల్ కు వెళ్లాలని ఫోర్స్ చేశారు. స్కూల్ కు వెళ్లి తన ముఖం చూపించడం ఇష్టం లేని ఆ బాలిక.. మరింత కుంగిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసింది. మళ్లీ ఆ స్కూల్ ముఖం చూడకూడదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది. ఆమెను గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. దీంతో తల్లిదండ్రుల రోదన ఆకాశాన్ని అంటింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు బాలిక ఆత్మహత్య చేసుకుందా? లేక స్కూల్ లో బాలికకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరిపిస్తున్నారు.