Indiramma Housing Scheme : మీరు ఇందిరమ్మ లబ్ధి దారులైతే మీకు ఒక గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Indiramma Housing Scheme : మీరు ఇందిరమ్మ లబ్ధి దారులైతే మీకు ఒక గుడ్ న్యూస్..!
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ప్రజల అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. ఇంకా సొంత ఇళ్లు లేని వారు ఎంతో మంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనలో ఆరు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. అందులో అధిక మొత్తంలో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయి. అయితే రెండో స్థానంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ప్రజల ఆకాంక్ష దేని మీద ఉందో అర్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి.గతంలో రేవంత్ సర్కార్ ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇంటి లేని పేదలకు ఇళ్లు అందించేందుకు హామీ ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకుంటుంది.
Indiramma Housing Scheme ఇక ఆలస్యం చేసేది లేదు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టగా,. డిసెంబర్ నెలాఖరు నాటికి సర్వే పూర్తి చేసి.. సంక్రాంతి నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావిస్తోంది. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి చేసే అవకాశం ఉంది. సొంత స్థలం ఉన్న వారికి మొదటి విడతలో ప్రాధాన్యత ఇస్తారు. జనవరి 7 నాటికి 80 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుందని అంచనా వేస్తోంది. తర్వాత లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో హౌసింగ్ సొసైటీని నిర్వీర్యం చేసింది. దీంతో దానిని బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ విభాగాల్లో పనిచేసిన కార్పొరేషన్ ఉద్యోగులను తిరిగి సొంత శాఖలోకి తీసుకువచ్చి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిబ్బందిని సిద్ధం చేసుకుంది.
లబ్ధిదారులకు నాలుగు విడతల్లో ఆర్థికసాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం అందుతువది. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలతోపాటు మరింత సాయం చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. . సిమెంటు బస్తా రూ.250, స్టీల్ టన్ను రూ.50 వేలు, ఇసుక రూ.1000కి అందించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. పదేండ్లలో హౌసింగ్ సెక్టార్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని అన్నారు. ‘అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. పేద వాళ్లకు మంచి చేకూరేలా మీరు పని చేయాలి అని పేర్కొన్నారు.