Good News : ఉపాధి కూలీలకి ఇది పెద్ద శుభవార్త.. పెండింగ్ వేతనాలు పడిపోయాయ్
ప్రధానాంశాలు:
Good News : ఉపాధి కూలీలకి ఇది పెద్ద శుభవార్త.. పెండింగ్ వేతనాలు పడిపోయాయ్
Good News : ఉపాధి హామీ కూలీలు ఉదయం లేచి ఎండ అనక, వానక అనక కష్టపడుతుంటారు. వారికి ఏ రోజుకు ఆ రోజు డబ్బులు మాత్రం ప్రభుత్వం ఇవ్వదు.. 15 రోజులు లేదా నెల రోజులకు ఒక వారం చేసిన పనికి మాత్రమే డబ్బులను వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఉపాధి హామీ పనుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సిబ్బందికి సకాలంలో వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.

Good News : ఉపాధి కూలీలకి ఇది పెద్ద శుభవార్త.. పెండింగ్ వేతనాలు పడిపోయాయ్
Good News : ఆనందంలో కూలీలు..
ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో వారి కష్టాలు కొంతైనా తీరనున్నాయి. చాలా మంది సిబ్బంది ఖాతాల్లో ఇప్పటికే జీతాలు జమ కావడం ప్రారంభమైందని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అందరికీ డబ్బులు అందుతుందని తెలుస్తోంది. వారి ఆవేదనను ప్రభుత్వం గుర్తించి వెంటనే నిధులు విడుదల చేయడం హర్షణీయం. ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా అమలు కావాలంటే సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించడం చాలా ముఖ్యం.
ఉపాధి హామీ పథకం అమలులో మరింత పారదర్శకత.. జవాబుదారీతనం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. గ్రామ పంచాయతీ స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది. ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిఘా కమిటీలు ఉండగా, తొలిసారిగా గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తూ మే 2వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో గ్రామ స్థాయి కమిటీలో ఐదుగురు ప్రభుత్వ సిబ్బంది ఉంటారు.తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజుకు రూ. 307 వరకు వేతనం లభిస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూలీ రేట్లను స్వల్పంగా పెంచింది.