Good News : నిరుద్యోగులకి ప్రత్యేక ఆఫర్.. ప్రభుత్వం నుండి రూ.5 లక్షల ఆర్ధిక సాయం..!
ప్రధానాంశాలు:
Good News : నిరుద్యోగులకి ప్రత్యేక ఆఫర్.. ప్రభుత్వం నుండి రూ.5 లక్షల ఆర్ధిక సాయం..!
Good News : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తున్నాం. రైతులు, మహిళలు, చేనేతలు, చేతి వృత్తుల వారు ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రజల్ని ఆదుకునేందుకు కొత్త పథకాలు ప్రారంభిస్తోంది. నిరుద్యోగుల కోసం అదిరిపోయే పథకాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యువ వికాసం స్కీమ్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Good News : నిరుద్యోగులకి ప్రత్యేక ఆఫర్.. ప్రభుత్వం నుండి రూ.5 లక్షల ఆర్ధిక సాయం..!
Good News ప్రభుత్వ సాయం..
నిరుద్యోగులకు లబ్ధి చేకూరే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను తీసుకురాగా, ఇందుకోసం ప్రభుత్వం రూ. 6 వేల కోట్లు కేటాయించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్ఠంగా రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి మే 31వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంజూరు పత్రాలు అందించనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథ కం ద్వారా ఒక్కో జిల్లాకు కనీసం 10వేల మందికి ప్రయోజనం కలిగేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నిరుద్యోగులు ఎంచుకునే యూనిట్ల ఆధారంగా రేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది.