Farmers : రైతుల‌కి తీపి క‌బురు.. రైతు భ‌రోసా విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతుల‌కి తీపి క‌బురు.. రైతు భ‌రోసా విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం

 Authored By ramu | The Telugu News | Updated on :10 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతుల‌కి తీపి క‌బురు.. రైతు భ‌రోసా విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం

Farmers : రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.. ఈ పథకం తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ అయ్యింది. బీఆర్‌ఎస్ పాలన పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత ఈ ప‌థ‌కాన్ని ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 రెండు విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చింది.

Farmers రైతుల‌కి తీపి క‌బురు రైతు భ‌రోసా విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం

Farmers : రైతుల‌కి తీపి క‌బురు.. రైతు భ‌రోసా విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌భుత్వం

Farmers శుభ‌వార్త‌..

కానీ ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు. ఇంత వ‌ర‌కు నాలుగు విడత‌ల్లో 3 ఎక‌రాలు ఉన్న రైతుల‌కి వ‌ర్తింప‌జేసింది.మ‌రోవారంలో నాలుగు ఎక‌రాలు ఉన్న రైతుల‌కి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున రైత‌లు ఖాతాలో జ‌మ చేసే అవ‌కాశం ఉంది. సాగుకి యోగ్యం కాని భూముల‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భ‌రోసా ఇచ్చిన‌ట్టే అవుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు పథకం కింద 79,844 ఎకరాలకు సాయం ఇచ్చారు. 81,000 ఎకరాల సాగు భూమి ఉన్న రైతుల్లో 48,072 మందికి ఈ పథకం వల్ల లాభం కలిగింది. 35,877 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 33.25 కోట్లు వేశారు. అప్పట్లో ఈ పథకం బాగానే నడిచిందని రైతులు చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది