Urea Shortage In Telangana : అన్నదాతల అంటే అంత చులకనా ఇంతలా అవమానిస్తారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Urea Shortage In Telangana : అన్నదాతల అంటే అంత చులకనా ఇంతలా అవమానిస్తారా..?

 Authored By sudheer | The Telugu News | Updated on :31 August 2025,5:07 pm

Urea Shortage : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా కోసం రైతులు రోజూ అష్టకష్టాలు పడుతుండగా, ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో చోటుచేసుకున్న సంఘటన ఈ నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలిచింది.

Urea shortage telangana

Urea shortage telangana

మరిపెడ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. అధికారులు యూరియా ఇచ్చే ముందు రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ తీసుకున్నారు. అయితే వాటిని గౌరవంగా భద్రపరచకుండా, చిత్తు కాగితాల్లా బయటకు పడేశారు. దీనిని చూసిన రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ ఆధార్, పాస్‌బుక్ ప్రతులను ఏరుకునే పనిలో పడిపోయి, యూరియా కోసం నిలిచిన లైన్‌ను వదిలి అసహాయంగా తిరిగారు.

రైతుల పట్ల అధికారుల ఈ నిర్లక్ష్య ధోరణిపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అన్నదాతలను గౌరవించాల్సిన పరిస్థితిలో వారిని అవమానించడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Also read

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది