Women’s Big Fighting : యూరియా కోసం నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women’s Big Fighting : యూరియా కోసం నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

 Authored By sudheer | The Telugu News | Updated on :5 September 2025,6:30 pm

Urea Shortage Telangana : తెలంగాణలో యూరియా కొరత కారణంగా రైతులు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై కొట్టుకున్న సంఘటన, ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మొన్నటి వరకు బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్న దృశ్యాలను చూశాం. ఇప్పుడు యూరియా కోసం జరిగిన ఈ ఘర్షణ, వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని సూచిస్తుంది.

Women pounding husks on the road for urea

Women pounding husks on the road for urea

మహబూబాబాద్‌లోని ఒక ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు క్యూ కట్టారు. ఈ క్రమంలో, ఆధార్ కార్డు నమోదు విషయంలో ఇద్దరు మహిళా రైతుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది తారాస్థాయికి చేరి, ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు, జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. పక్కన ఉన్నవారు జోక్యం చేసుకొని వారిని విడదీసేంత వరకు ఈ ఘర్షణ కొనసాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సంఘటన రాష్ట్రంలో ఉన్న యూరియా కొరతను స్పష్టంగా చూపిస్తోంది. రైతులు ఒక బస్తా యూరియా కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చివరికి అది కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో నిస్సహాయత, ఆందోళనతో ఇలాంటి ఘర్షణలకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి, రైతులకు అవసరమైన యూరియా సరఫరాను క్రమబద్ధం చేయాలని రైతులు మరియు ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది