Rains : ఏపీ, తెలంగాణలకి చల్లని కబురు.. ఇక వర్షాలే వర్షాలు
Rains : గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజు రోజుకి వేడి పెరిగిపోవడంతో బయటకు కూడా రాలేని పరిస్థితి. ఎప్పుడు వర్షాలు పడతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రవేశించాయి. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని […]
Rains : గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్ర ప్రజలు ఎండ వేడిమితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రోజు రోజుకి వేడి పెరిగిపోవడంతో బయటకు కూడా రాలేని పరిస్థితి. ఎప్పుడు వర్షాలు పడతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు శుక్రవారం కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రవేశించాయి. శుక్రవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారంనాడు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రజలకి ఉపశమనం..
వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు శనివారం వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది ఇలావుంటే, నైరుతి రుతుపవనాలు దేశంలోని పలు ప్రాంతాల్లోకి అనుకున్న తేదీ కన్నా ముందే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్ధితులు కనిపిస్తున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రేపు ఏపీలో ఒకటి రెండు చోట్ల తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, క్రమంగా ఎల్లుండి నుంచి ఇక వీటి ప్రభావం రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తుందని అంచనా. అంటే మరో నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.