Rs.500 Gas Cylinder : శుభవార్త.. మరో రెండు రోజుల్లో రూ.500 కే గ్యాస్ సిలిండర్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..!!
ప్రధానాంశాలు:
Rs.500 Gas Cylinder : శుభవార్త.. మరో రెండు రోజుల్లో రూ.500 కే గ్యాస్ సిలిండర్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం..!!
Rs.500 Gas Cylinder : తెలంగాణ సర్కార్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు గ్యారెంటీల అమలకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేస్తోంది. గృహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 కే గ్యాస్ సిలిండర్ గృహజ్యోతి పథకంలో భాగంగా 2 యూనిట్ల లోపు కరెంటు వాడే వారికి ఉచిత కరెంటు పథకాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీని పిలిచి ఈ రెండు గ్యారెంటీలకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టబోతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ రెండు పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. అయితే గృహాలక్ష్మి పథకం అమలకు సర్కార్ సిద్ధమైంది. 500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి 80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆరు గ్యారెంటీల లో భాగంగా 500 కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఈనెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు పథకానికి నిధుల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ పాలనపరమైన ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకానికి 40 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారుల అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ ఇటీవల ప్రకటించింది. అయితే సబ్సిడీ వంట గ్యాస్ పథకానికి రేషన్ కార్డుకు లింకు పెట్టడం ఆందోళన కలిగిస్తుంది. రేషన్ కార్డు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులు. అయితే వంట గ్యాస్ కనెక్షన్ దారులలో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. ముఖ్యంగా గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు పెళ్లి చేసుకుని వేరుపడడం, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
అది సబ్సిడీ గ్యాస్ అర్హతకు సమస్యగా మారింది అని అధికారులు అంటున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఉజ్వల కళ్యాణ్ యోజన పథకం లబ్ధిదారులకు ఈ మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ పథకం తెలంగాణ ప్రజలకు అమలు కానుంది. ఇక 27వ తారీకు జరగనున్న చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీని పిలిచి గృహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ రెండు పథకాలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇక 500 లకే గ్యాస్ సిలిండర్ పథకానికి 80 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.