Indiramma Housing Scheme : పేదల ఇంటి కల తీరనుందా.. వచ్చే వారం నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..!
ప్రధానాంశాలు:
Indiramma Housing Scheme : పేదల ఇంటి కల తీరనుందా.. వచ్చే వారం నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..!
Indiramma Housing Scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంది. పేదలకు మొదట 7,000 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో 3,500 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Indiramma Housing Scheme : పేదల ఇంటి కల తీరనుందా.. వచ్చే వారం నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..!
Indiramma Housing Scheme సమయం లేదు..
ఇప్పటికీ మన దేశంలో ఇళ్లు లేని పేదలు కోట్లలో ఉన్నారు. ఇంతకంటే విచారం ఏముంటుంది? అందుకే ఇందిరా గాంధీ ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ.. ఇందిరమ్మ ఇండ్లు పథకం తెచ్చింది. దీని ప్రకారం తొలి విడతలో అర్హుల ఎంపిక పూర్తవగా.. ఇప్పుడు రెండో విడతలో అర్హుల ఎంపిక మొదలైంది. ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని జనవరి 26, 2025న ప్రారంభించింది.
ఇక వచ్చేవారం నుండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్టు పొంగులేటి ప్రకటించారు. ప్రతి నియోజక వర్గంలో 3500 ఇవ్వనున్నట్టు ఆయన తెలియజేశారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు.. ఇప్పుడు ఇళ్లలోనే అందుబాటులో ఉండాలి. ఎందుకంటే.. ఏదో ఒక టైమ్‌లో అధికారులు ఇళ్లకు వచ్చి.. దరఖాస్తు ఫారంలో చెప్పిన వివరాలు నిజమేనా కాదా అన్నది పరిశీలిస్తారు.