Indiramma Housing Scheme : అలాంటి రైతులకు ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణా ప్రభుత్వం ప్రకటన.. సూపర్ గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
Indiramma Housing Scheme : అలాంటి రైతులకు ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణా ప్రభుత్వం ప్రకటన.. సూపర్ గుడ్ న్యూస్..!
Indiramma Housing Scheme : తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రాజెక్ట్ కు నిర్ణయం తీసుకుంది. ఈ పార్క్ అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల సంకేష్మానికి సీఎం రేవంత్ రెడ్డి తాజా గా రైతుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉందని వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకునేలా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించినట్టుగా టేక్స్ టైల్ పార్క్ భూములు అందించిన రైతులందరికీ ఇంటి స్థలం.. అలానే ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.
ఇప్పుడు దానికి సంబందించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఆ టెక్స్ టైల్ పార్క్ కోసం ఇచ్చిన వారికి అంటే మొత్తంగా 863 ఇల్లు సాంక్షన్ చేశారు. రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుని ఈ ప్రభుత్వం పనిచేస్తుందని.. అందుకే 863 ఇందిరమ్మ ఇల్లు అనుమతి ఇచ్చిందని నేతలు చెబుతున్నారు. ఐతే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాస్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Indiramma Housing Scheme టెక్స్ టైల్ పార్క్ కోసం..
ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్టు పరకాల ఎమ్మెల్యే చెప్పారు. టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఇల్ల నిర్మాణం ద్వారా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నవంబర్ 19న వరంగల్ కి వచ్చి వీరికి ఇల్ల పట్టాలు అందిస్తారని తెలుస్తుని.
ఈ కార్యక్రమం రైతుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఉంటుందని చెబుతున్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభువం కట్టుబడి ఉందని.. వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఐతే టెక్స్ టైల్ పార్క్ కోసం భూములు కేటాయించిన రైతులంతా ఈ నిర్ణయం వల్ల సంతోషంగా ఉన్నారు.Indiramma houses, Farmers, Textile Park, Warangal, Telangana State, CM Revanth Reddy