It Raids : లెక్క‌లు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

It Raids : లెక్క‌లు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో..!

 Authored By ramu | The Telugu News | Updated on :23 January 2025,2:10 pm

ప్రధానాంశాలు:

  •  It Raids : లెక్క‌లు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో..!

It Raids : ఇన్‌కంటాక్స్‌ అధికారుల సోదాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌వీసీ, మైత్రి , మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరా తీసారు. Pushpa 2 Movie పుష్ప-2 బడ్జెట్‌, వచ్చిన ఆదాయంపై కూడా అధికారులు ఆరా తీసారు. ఐటీ రిటర్న్స్‌ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేసిన‌ట్టు తెలుస్తుంది. మంగ‌ళ‌వారం రోజు నిర్మాత దిల్‌ రాజు సతీమణి తేజస్వినితో అధికారులు బ్యాంకు లాకర్లు తెరిపించారు. బుధవారం మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన‌ట్టు తెలిసింది . స్టార్ డైరెక్టర్ సుకుమార్ director sukumar ఇంటిపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

It Raids లెక్క‌లు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు మూడో రోజు కూడా సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో

It Raids : లెక్క‌లు తేల్చాల్సిందే అంటున్న ఐటీ అధికారులు.. మూడో రోజు కూడా సినీ ప్ర‌ముఖుల ఇళ్ల‌లో..!

It Raids వ‌రుస దాడులు..

బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని Hyderabad సుకుమార్ మొదలైన తనిఖీలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ‘పుష్ప 2’ భారీ కలెక్షన్ల నేపథ్యంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పుష్ప 2 నిర్మాణంలో సుకుమార్ కి కూడా షేర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో, ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో మూడు రోజు సోదాలు కొనసాగుతున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు టార్గెట్‌గా ఇన్‌కంటాక్స్‌ అధికారులు మంగళవారం వరుస సోదాలతో హడలెత్తించారు. ఒకటీ, రెండు కాదు ఏకంగా 55 ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, ఫిలిం ప్రొడక్షన్‌ సంస్ధల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

ఇటీవల సంక్రాంతికి విడుదలైన గేమ్‌ ఛేంజర్‌ game changer , సంక్రాంతికి వస్తున్నాం sankranthiki vasthunam సినిమాలకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాల్లో, ఆయన కుమార్తె హన్సిత రెడ్డి, సోదరుడు శిరీష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల పలు సినిమాలకు భారీగా పెట్టుబడి పెట్టామని.. సినిమా ఇంత బిజినెస్‌ చేసిందని మేకర్స్‌ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా పెట్టుబడులు.. వచ్చిన ఆదాయం.. కడుతున్న ఇన్‌కం ట్యాక్స్‌ విషయంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.సింగర్‌ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్ధలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్‌ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఒక బ్యాంకు లాకర్‌ను గుర్తించి ఆ లాకర్‌ దిల్‌రాజు భార్య తేజస్వీని పేరిట ఉండటంతో ఆమెను బ్యాంకుకు తీసుకుని వెళ్లి లాకర్‌ తెరిపించారు

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది