It Raids : ఏకకాలంలో ఐటీ దాడులు.. దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌పై రైడ్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

It Raids : ఏకకాలంలో ఐటీ దాడులు.. దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌పై రైడ్స్

 Authored By ramu | The Telugu News | Updated on :21 January 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  It Raids : ఏకకాలంలో ఐటీ దాడులు.. దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌పై రైడ్స్

It Raids : సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల ఇళ్ల‌ల్లో ఐటీ దాడులు జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ముఖ సినీ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు Dil Raju  ఇల్లు, కార్యాలయాల్లో మంగళవారం ఉదయం ఐటీ అధికారులు దాడి చేశారు. దిల్ రాజుతో పాటు ఆయన పార్ట్నర్, నిర్మాత శిరీష్ Shirish ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. Dil raju దిల్ రాజు కూతరు హన్సిత రెడ్డి ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేసినట్టు తెలుస్తుంది.. వీరితోపాటు మరి కొందరు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ నిర్మాతల ఇళ్లలోనూ సోదాలు చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దిల్ రాజు ఇటీవల సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వచ్చారు…

It Raids ఏకకాలంలో ఐటీ దాడులు దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌పై రైడ్స్

It Raids : ఏకకాలంలో ఐటీ దాడులు.. దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌పై రైడ్స్

It Raids ఐటీ న‌జ‌ర్..

ఇందులో గేమ్ ఛేంజర్ సినిమా యావరేజ్ గా నిలిచి నష్టాలు మిగిలిస్తే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం పెద్ద హిట్ అయి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య డాకు మహారాజ్ సినిమా కూడా దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఈ సినిమాకు కూడా బాగానే లాభాలు వచ్చాయి. ఈ క్ర‌మంలోనే ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుపుతుండటం గమనార్హం. తాజాగా ‘పుష్ప 2’ ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీస్ లోను అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారే ఐటీ అధికారులు విజృంభించడంతో అందరు ఆసక్తికరంగా ఈ ఎపిసోడ్ ని వీక్షిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు మాంగో మీడియా సంస్థ లోకూడా సోదాలు జరుగుతున్నాయి. సింగర్ సునీత భర్త ..రాము కు సంబంధిన సంస్థ మాంగోపై దాడులు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై నేటి ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలో కార్యాలయాలపైన, ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది