Jagadish Reddy : కవితని పట్టించుకోనవసరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
ప్రధానాంశాలు:
Jagadish Reddy : కవితని పట్టించుకోనవసరం లేదు... బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేత కల్వకుంట్ల కవితపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ, ఆమె వ్యాఖ్యలకు, లేఖలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.“కవిత చేసిన కామెంట్లను, రాసిన లేఖలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అసలే పట్టించుకోవడం లేదు. ఆమె ‘జాగృతి’ అనే సంస్థ పెట్టుకుని ఆమె పని ఆమె చేసుకుంటున్నారు. అందులో చర్చించాల్సిన విషయం ఏమీలేదు. అవసరమే లేదు,” అని ఆయన అన్నారు.

Jagadish Reddy : కవితని పట్టించుకోనవసరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!
Jagadish Reddy : చర్చే అనవసరం..
ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇటీవలే కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరైన నేపథ్యంలో, ఆమెపై పార్టీ వర్గాలే ప్రశ్నలు గుప్పిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, పార్టీ ఓటమి అనంతరం కవిత రాజకీయ వ్యూహాలపై కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు.
పార్టీలోని అంతర్గత సంక్షోభానికి ఈ వ్యాఖ్యలు ఉదాహరణగా మారాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ భవిష్యత్తు దృష్ట్యా ఈ వ్యాఖ్యలు ఎంతదాకా ప్రభావం చూపనున్నాయో చూడాలి. అయితే బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డిచేసిన వ్యాఖ్యల పట్ల కవిత ఎలా స్పందిస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.