Telangana Assembly Elections 2023 : ఇది నిఖార్సయిన సర్వే అంటే.. తెలంగాణలో ఎవరిది అధికారమో నెల రోజుల ముందే తేల్చేసిన జాతీయ సర్వే
ప్రధానాంశాలు:
జనతా కా మూడ్ సర్వే ఫలితాలు విడుదల
బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది?
కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది?
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. తక్కువ సమయమే ఉండటంతో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతున్నాయనే చెప్పుకోవాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రజల నాడి ఎలా ఉంటుందో.. ఓటు వేసే వరకు డౌటే. ఓట్లు వేసిన తర్వాత ఫలితాలు వచ్చాకనే కన్ఫమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు ప్రజలు మూడో సారి పట్టం కడతారా లేదా లేక ఒక్క చాన్స్ అంటూ బతిమిలాడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు ఒక చాన్స్ ఇస్తారా అనేది వేచి చూడాలి.
అయితే.. ఈ మధ్యలో కొన్ని జాతీయ సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందో ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో సర్వేలు నిర్వహించి ఫలానా పార్టీనే గెలుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది అని స్పష్టం చేశాయి. టైమ్స్ నౌ లాంటి జాతీయ సంస్థలు మాత్రం మళ్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పాయి. తాజాగా జనతా కా మూడ్ అనే సర్వే సంస్థ తెలంగాణలో ఎన్నికల సర్వేను నిర్వహించింది. ఆ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నట్టు జనతా కా మూడ్ సర్వే వెల్లడించింది. లక్షా ఇరవై వేల శాంపిల్స్ తో ఈ సర్వేను ఆ సంస్థ నిర్వహించింది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 20 వరకు ఈ సర్వే నిర్వహించగా.. అందులో బీఆర్ఎస్ కు 72 నుంచి 75 వరకు సీట్లు వస్తాయని ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీకి 31 నుంచి 36 వరకు సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 6 నుంచి 7 వరకు సీట్లు, ఎంఐఎంకు 4 నుంచి 6 వరకు సీట్లు వస్తాయని తెలిపింది. ఇక.. ఓట్ షేర్ చూస్తే బీఆర్ఎస్ కు 41 శాతం, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం, బీజేపీకి 14 శాతం, ఎంఐఎం పార్టీకి 3 శాతం సీట్లు వస్తాయని తెలిపింది. సర్వే సంస్థలన్నీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.