KCR : అయ్యో.. సారూ రెండు చోట్లా కష్టమే అంటున్న ఎగ్జిట్ పోల్స్.. కారణం ఇదేనా..?
ప్రధానాంశాలు:
KCR : అయ్యో.. సారూ రెండు చోట్లా కష్టమే అంటున్న ఎగ్జిట్ పోల్స్.. కారణం ఇదేనా..?
KCR : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అలా పోలింగ్ అయిపోయిందో లేదో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. అయితే చాలావరకు ఎగ్జిట్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసాయి. ఒకటి రెండు సంస్థలు మాత్రం భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని చెప్పేసాయి. అయితే చాలావరకు ఎగ్జిట్ సంస్థలు వాస్తవానికి దగ్గరగానే సర్వే చేస్తుంటాయి. ఎలాగూ సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో బీఆర్ఎస్ క్యాడర్లో నిర్వేదం అలుముకుంది. కేటీఆర్ అప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పటికి అది పెద్దగా ప్రయోజనం కలిగించలేదు. అంతేకాకుండా కేటీఆర్ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీరియస్ గా సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ కచ్చితంగా ఓడిపోతుందని భారత రాష్ట్ర సమితి కార్యవర్గంలో ప్రముఖంగా వినిపిస్తుంది.
ఇక కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లో కూడా పోటీ చేశారు. అయితే అక్కడి స్థానికుడైన వెంకటరమణ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ ఆయన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి లో ఓడిపోతారని తెలుస్తుంది. ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం కేసీఆర్ అక్కడ రెండవ స్థానానికి పరిమితం కాబోతున్నారని తెలుస్తుంది. కేసీఆర్ తన రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్ళలో మదన్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఓటమి అనేది తెలియకుండా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్స్ కామారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని చెప్పడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
ఇక కేసిఆర్ కామారెడ్డి తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేశారు. ఇక్కడ కూడా కేసీఆర్ గెలిచే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఈటల రాజేందర్ గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ జరిగిన పోలింగ్ విధానాన్ని బట్టి ఫలితం అనూహ్యంగా రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు మాత్రం అక్కడ కేసీఆర్ స్వల్ప మెజారిటీతో గెలుస్తారని చెబుతున్నాయి. అయితే గజ్వేల్ లో సమస్యలు, మల్లన్న సాగర్ ముంపు బాధితుల ఇబ్బందులను ఈటల రాజేందర్ తెర పైకి తీసుకు రావడం లో సక్సెస్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్ లోను ఆయన చాకచక్యంగా వ్యవహరించారని తెలుస్తుంది. అందువల్ల గజ్వేల్ లో కూడా కేసీఆర్ కి గట్టి పోటీ ఏర్పడింది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం, మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో భారత రాష్ట్ర సమితి పూర్తిగా డీలా పడిపోయింది.