Jaya Prakash Narayana : కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేస్తే తెలంగాణ ఏమౌతుంది.. జేపీ చెప్పిన మాటలు వింటే దడపుట్టాల్సిందే?
ప్రధానాంశాలు:
రుణ మాఫీకి రూ.2,70,000 కోట్లు వెచ్చించాలి
ప్రభుత్వ ఉద్యోగులు 3 శాతమే
రూ.1,20,000 కోట్లు అదనపు ఖర్చు కాబోతోంది
Jaya Prakash Narayana : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ముఖ్య కారణం 6 గ్యారెంటీ హామీలే అని తెలుస్తోంది. 6 గ్యారెంటీ హామీలు అమలు అనేది మామూలు విషయం కాదు.. వేల కోట్లు కావాలి.. ఆ హామీలు అమలు చేయడానికి. మరి.. నిజంగానే ఆ 6 గ్యారెంటీ హామీలు అమలు చేసేంత డబ్బు ప్రభుత్వం వద్ద ఉందా? అసలు ఇవి అమలు సాధ్యమయ్యే హామీలేనా.. అనే దానిపై తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఖచ్చితంగా ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే సంవత్సరానికి రూ.70 వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టాల్సి వస్తుంది అని అన్నారు.
ఇప్పటికే 50 వేల కోట్ల పైచిలుకు ఖర్చు అవుతోంది. రుణ మాఫీకి రూ.2,70,000 కోట్లు వెచ్చించాలి. దళిత బంధు కింద కూడా వేల కోట్ల నిధులు కావాలి. ఇలా డబ్బులు పంచడం కరెక్ట్ కాదని నేను ముందే చెప్పను కానీ.. వినలేదు అని జేపీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పథకాలను కొన్నింటిని తీసేయకుండా వాటిని కొనసాగిస్తామని.. ఇంకా ఇచ్చే సాయం కూడా పెంచారు. దళిత బంధుకే సంవత్సరానికి రూ.50 వేలు అవుతుంది. మొత్తం కలిపితే రూ.1,20,000 కోట్లు అదనపు ఖర్చు కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. వీటిలో ఆచరణ సాధ్యం అయినవి.. చేయండి.. ఆచరణ సాధ్యం కానివి చేయకండి అని జేపీ చెప్పారు. 2022-23 లెక్కలు తీసుకుంటే రూ.1,72,000 కోట్ల రెవెన్యూ వ్యయం అంటే రోజువారి ఖర్చు అవుతోంది. దానిపై అదనంగా రూ.1,20,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే అది సాధ్యం కాదు.
Jaya Prakash Narayana : అప్పు తెస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది
అప్పు తెస్తే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఖచ్చితంగా సంక్షేమం అవసరం కానీ.. సంక్షేమమే పాలన, అభివృద్ధి వద్దు అంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే. ఓపీఎస్ వల్ల గెలుస్తామనే పిచ్చి ఆలోచన వద్దు. ప్రభుత్వ ఉద్యోగులు 3 శాతమే. వాళ్ల కోసం ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇవ్వకండి. పాత పద్ధతి కాదు.. కొత్త పద్ధతి ద్వారా చేయండి. ఎన్నికల్లో భయంతో ఎలాగైనా గెలవాలనే కోరికతో రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తున్నారు. లేకపోతే పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం చాలా సమస్యల్లో పడబోతోందన్నారు. ఆర్థికంగా మనమే నష్టపోనున్నాం. ఆర్థికాభివృద్ధి జరగదు అని జేపీ స్పష్టం చేశారు.