TGSRTC లో భారీ ఉద్యోగాలు.. ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
TGSRTC : నిరుద్యోగులకు టీ.జి.ఎస్.ఆర్.టి.సీ నుంచి శుభవార్త వచ్చింది. బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టీ.జి.ఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. మంత్రి లేటెస్ట్ గా కరీం నగర్ లో 33 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి రాష్ట్రంలో త్వరలో 500 ఎలెక్ట్రిక్ బస్సులు ప్రారహించనున్నట్ట్ చెప్పారు. మొదటి దశలో కరీం నగర్నుంచి 33 బస్సులు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. […]
ప్రధానాంశాలు:
TGSRTC లో భారీ ఉద్యోగాలు.. ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
TGSRTC : నిరుద్యోగులకు టీ.జి.ఎస్.ఆర్.టి.సీ నుంచి శుభవార్త వచ్చింది. బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టీ.జి.ఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. మంత్రి లేటెస్ట్ గా కరీం నగర్ లో 33 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ మంత్రి రాష్ట్రంలో త్వరలో 500 ఎలెక్ట్రిక్ బస్సులు ప్రారహించనున్నట్ట్ చెప్పారు. మొదటి దశలో కరీం నగర్నుంచి 33 బస్సులు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
ఇదే క్రమంలో తెలంగాణాలో కాంగ్రెస్ రావడం వల్లే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తున్నామని అన్నారు. తెలంగాణా బస్సుల్లో ఇప్పటి వరకు 92 కోట్ల ఉచిత మహిళా టికెట్లు జారీ అయినట్టు తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణానికి గాను 3200 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఇక రాబోతున్న బతుకమ్మ, దసరాకు కూడా ప్రయాణీకులకు అదనపు బస్సులు నడిపిస్తామని వెల్లడించారు. హదరాబాద్ లో డీజిల్ బస్సులు తగ్గించి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టేలా చూస్తామని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ, కారుణ్య నియామకాల పై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
TGSRTC రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3035 పోస్టుల భర్తీ..
ఆదివారం 35 బస్సులు ప్రయాణీకులకు అంగుణంగా సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు. ఈ ఎలక్ట్రిక్ అబ్స్సుల్లో 41 సీట్లు ఉంటాయని ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 325 కిలోమీటర్లు ప్రయాణిస్తామని అన్నారు. 2 నుంచి 3 గంటల్లో వంద శాతం ఛార్జింగ్ వస్తుందని అన్నారు. వీటిలో క్యాబిన్, సెలూన్ రెండు చోట్ల కెమెరాలు ఉన్నాయని అన్నారు.
ఇక తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 3035 పోస్టుల భర్తీకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవర్ పోస్టులు ఉండగా. 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ విభావం. 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజినెర్ (సివిల్), 7 మెడికల్ ఆఫీసర్, 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 7 మెడికల్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబందించిన నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది.