CM Revanth Reddy : కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ మాములు సెటైర్లు వెయ్యలేదుగా..!!
ప్రధానాంశాలు:
CM Revanth Reddy : కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ మాములు సెటైర్లు వెయ్యలేదుగా..!!
CM Revanth Reddy : తెలంగాణ Telangna CM ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ సందర్భంగా తెలంగాణ రాజకీయ పరిణామాలపై సూటిగా స్పందించారు. నిన్న కేసీఆర్ సభలో ఇచ్చిన ప్రసంగం అధికారం కోల్పోయిన బాధను ప్రతిబింబించిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రసంగంలో పస లేదని విమర్శించారు. తన ప్రసంగం ద్వారా కేసీఆర్ తన అక్కసును బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తన పిల్లలను అసెంబ్లీకి పంపడం ద్వారా కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నాడో ప్రజలకు చెప్పాలన్నారు.

CM Revanth Reddy : కేసీఆర్ స్పీచ్ పై రేవంత్ మాములు సెటైర్లు వెయ్యలేదుగా..!!
CM Revanth Reddy కేసీఆర్ ఆ బాధలో ఆలా మాట్లాడాడు – రేవంత్
రాజకీయాల్లో నైతిక విలువల అవసరముందని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపైనా ఉందని ఆయన హితవు పలికారు.ఇక ఈ ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు ఎవరూ లేరని గుర్తుచేశారు.”కేసీఆర్, మోడీ ఇద్దరూ తమ అవసరాలకు అనుగుణంగా మాటల్ని మార్చుకుంటారు అని, తనకు మరియు రాహుల్ గాంధీకి మధ్య మంచి సంబంధం ఉందని స్పష్టం చేశారు. దీనిని ఎవరిని నమ్మించాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేవని, తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఇక ఆపరేషన్ కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరారు.