KCR : ఎలక్షన్స్ వస్తున్నాయ్ కెసిఆర్ సారూ.. పరువు పోగొట్టుకోకండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : ఎలక్షన్స్ వస్తున్నాయ్ కెసిఆర్ సారూ.. పరువు పోగొట్టుకోకండి..!

 Authored By kranthi | The Telugu News | Updated on :20 July 2023,4:00 pm

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉండేవారు. కేసీఆర్ అంటే దేవుడు అని మొక్కిన వాళ్లూ ఉన్నారు. అందుకే 2014 లో కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టారు. 5 ఏళ్లు సరిపోదు అని మరోసారి కూడా కూర్చోబెట్టారు. కానీ.. రాను రాను తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును చూసి ప్రజలు విసిగించుకుంటున్నారు. ముఖ్యంగా భూముల విషయంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

భూకేటాయింపుల విషయంలో జరిగే అక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ కు బ్యాడ్ నేమ్ వస్తోంది. తెలంగాణను దేశంలోనే ఒక రోల్ మోడల్ గా చూపిస్తానని కేసీఆర్ మాటిచ్చారు. కానీ.. ఆ దిశగా జరుగుతున్న అభివృద్ది అయితే ఏం లేదు. దానికి బదులు.. భూబాగోతాలు మాత్రం పెరిగాయి. ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వం భూములను పంచిపెడుతున్నారని, భూములను పంచిపెట్టడమే తమ విధానం అన్నట్టుగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.భూములను కేసీఆర్ పప్పులు బెల్లాలులా పంచిపెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు పాలనపై అందుకే విపక్షాలు భగ్గుమంటున్నాయి. భూముల విషయంలో కేసీఆర్ పరువు పోతుండటంతో అసలు త్వరలో ఎన్నికలు పెట్టుకొని ఎందుకు కేసీఆర్ ఇలా చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ కోసం తీసుకున్న భూమి విషయంలోనూ హైకోర్టు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం 11 ఎకరాలు కేటాయించారు.

kcr govt having issues with land problems

kcr govt having issues with land problems

KCR : భూములు అంటే పప్పులు బెల్లాలా?

కానీ.. అది దాదాపు 500 కోట్ల విలువైన భూమి. దాన్ని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి 37 కోట్లకే కట్టబెట్టడంపై కోర్టులో కేసు వేయడంతో ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలా.. ఇదొక్కటే కాదు.. చాలా భూముల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలపై తెలంగాణ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇలా చేస్తోంది.. అంటూ మండిపడుతున్నారు.

Tags :

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది