KCR : కేసీఆర్ భారీ వ్యూహం.. ఏపీలో ఐదు లక్షల మందితో సభ.. ఆ ముగ్గురు అవుట్ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ భారీ వ్యూహం.. ఏపీలో ఐదు లక్షల మందితో సభ.. ఆ ముగ్గురు అవుట్ ..?

 Authored By brahma | The Telugu News | Updated on :5 April 2021,2:19 pm

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంత త్వరగా అర్ధం కావు.. ఆయన ఏమైనా చేయాలని అనుకుంటే దానికి తగ్గట్లు గ్రౌండ్ సిద్ధం చేసుకొని దిగుతాడు.. ఎప్పటినుండో బీజేపీకి వ్యతిరేకంగా తన వాణి వినిపించాలని బలంగా ఎదురుచూస్తున్నాడు. ఒకటి రెండు సందర్బాలు దొరికిన కానీ, తెలంగాణలో పరిస్థితి కేసీఆర్ కు అనుకూలించలేదు. దీనితో ఇప్పుడు తన రూటు మార్చినట్లు తెలుస్తుంది.. ఈసారి తెలంగాణ గడ్డ మీద నుండి కాకూండా ఆంధ్రుల గడ్డ నుండి బీజేపీ వ్యతిరేక స్వరాన్ని వినిపించాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తుంది..

కేసీఆర్ ఏంటి ఆంధ్రా నుండి పోరాటం ఏంటని అందరు అనుకోవచ్చు కానీ, రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఉహించలేము.. ప్రస్తుతం ఆంధ్రాలో విశాఖ స్టీల్ ఉద్యమం నడుస్తుంది. దీనికి వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతు ఇచ్చిన కానీ, ఉద్యమంలోకి నేరుగా వచ్చే ప్రసక్తి లేదు. దీనికి ఎవరికివారికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా వైసీపీని తీసుకుంటే.. పార్టీ అధినేత సీఎం జగన్పై సీబీఐ కేసులు.. ఉన్నాయి. ఇక చంద్రబాబుపై ఓటుకు నోటు సహా వివిధ అవినీతి మరకలు అంటుకున్నాయి.

ఇక జనసేన అధినేత పవన్.. పెయిడ్ బ్యాచ్ అనే ముంద్ర సంపాయించుకున్నారు. దీంతో రాజకీయంగా బీజేపీని టార్గటె్ చేసేందుకు ఈ ముగ్గురూ కూడా ఉత్సాహం చూపించడం లేదు. ఒక్క మాట కూడా అనకపోగా.. అవకాశం చూసుకుని మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరూ కూడా ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న దాఖలా కనిపించడం లేదు.

KCR : విశాఖ ఉక్కు ఉద్యమం

ఇదే సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమం గురించి కేటీఆర్ మాట్లాడటం, ఉద్యమ నేతలు కేటీఆర్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. పైగా గంట శ్రీనివాసు లాంటి కీలక నేత కూడా కేటీఆర్ ను కలవటం అనేది చిన్న విషయం కాదు.. ఇవన్నీ కూడా కేసీఆర్ సున్నితంగా గమనిస్తున్నాట్లు తెలుస్తుంది. అయితే సరైన సమయం కోసం చూస్తున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి..

kcr Public Meeting In Andhrapradesh

kcr Public Meeting In Andhrapradesh

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, వాటి ఫలితాలను బట్టి కేసీఆర్ వ్యూహం ఉండబోతుందని సమాచారం.. మమతా బెనర్జీ మరోసారి గెలిచి వచ్చే ఎన్నికల నాటికీ ప్రత్యేక ఫ్రంట్ ఏర్పడితే.. అందులోకి కేసీఆర్ వెళ్ళిపోయి, ఇక్కడ కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనీ చూస్తున్నాడు. ఇదే సమయంలో ఆ ప్రత్యేక ఫ్రంట్ లో తన విలువ ఏమిటో చూపించుకోవాలి కాబట్టి, విశాఖలో దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి బీజేపీ మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు..

అదే కనుక జరిగితే ఇక ఆంధ్రలోని కీలక నేతలైన ఆ ముగ్గురు ఇబ్బంది తప్పకపోవచ్చు, పక్క రాష్ట్రము వ్యక్తి వచ్చి విశాఖ ఉద్యమం కోసం పోరాటం చేస్తుంటే సొంత రాష్ట్రము నేతలపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు ప్రజా ఆగ్రహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రభావం ఆ తర్వాత జరగబోయే ఎన్నికల మీద ఉంటుంది.. ఇక ఫైనల్ గా చెప్పాలంటే కేసీఆర్ మాత్రం విశాఖ ఉద్యమంలో పాల్గొంటే మాత్రం బీజేపీ పరిస్థితి ఏమిటో కానీ,, ఈ ముగ్గురు నేతలకు మాత్రం ఇబ్బందులు ఖాయం .

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది