KCR : ఏపీలో అధికారంలోకి వచ్చేది అతనే అంటూ కేసీఆర్ జోస్యం..!
ప్రధానాంశాలు:
KCR : ఏపీలో అధికారంలోకి వచ్చేది అతనే అంటూ కేసీఆర్ జోస్యం..!
KCR : ఈ సారి ఏపీలో రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలోకి వస్తారు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సారి సత్తా చాటుతాడా లేదా ఇలా ఎన్నో అనుమానాలు అందరిలో ఉన్నాయి. మరి కొద్ది రోజులలో వీటిపై అయితే క్లారిటీ రానుంది.తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల మీద తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్లో పాల్గొన్న కేసీఆర్ అనేక అంశాల మీద మాట్లాడారు. ఏపీలో ఎవరు గెలుస్తారంటూ యాంకర్ ప్రశ్నించగా.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాట్లాడటం సరికాదని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత ఏపీలో ఎవరు గెలిచినా తమకు ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు.
KCR : రేవంత్‌కి నాపై కక్ష అందుకే..
ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమకు పెద్దగా పట్టింపు ఉండదని, ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారని కేసీఆర్ అన్నారు. అయితే తమకు వచ్చిన సమాచారం మేరకు జగన్ గెలుస్తారని తెలుస్తోందని కేసీఆర్ అన్నారు. అయితే ఎవరు గెలిచినా తమకు బాధ లేదని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీ నేతగా ఓ పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్న కేసీఆర్.. వాళ్ల రాష్ట్రం వాళ్ల రాజకీయాలు వారు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.అయితే ఏపీలో పోటీ చేయడంపై కూడా కేసీఆర్ స్పందించారు. ప్రస్తుతానికి అయితే ఏపీ ఎన్నికలలో పోటీ చేయడం లేదని, భవిష్యత్‌లో మాత్రం తప్పక పోటీ చేస్తామని చెప్పారు.
కూతురు , ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కూడా స్పందించిన కేసీఆర్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, ఇదింతా కూడా ప్రధాని మోదీ సృష్టేనంటూ కేసీఆర్ తేల్చి చెప్పారు. నా కూతురు కవితకు ఏమి తెలియదని, లిక్కర్ స్కామ్‌తో కవితకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆయన కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు